NTV Telugu Site icon

Taapsee Pannu: ఏరు దాటాక తెప్ప తగలేస్తున్నావా.. సిగ్గులేదు

Tapsee

Tapsee

Taapsee Pannu: ఏరు దాటాకా తెప్ప తగలేసినట్టు అని తెలుగులో ఒక సామెత అందరికి తెలిసే ఉంటుంది. సక్సెస్ అందుకున్నాకా.. ఆ సక్సెస్ కు కారణం అయినవారిని మరిచి తమను తాము పొగుడుకున్నవారి గురించి మాట్లాడే సమయంలో ఈ సామెతను వాడుతారు. ప్రస్తుతం నటి తాప్సీ కి అయితే ఈ సామెత బాగా సూట్ అవుతుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. అందుకు కారణం సౌత్ ఇండస్ట్రీపై తాప్సీ చేసిన వ్యాఖ్యలే. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది సొట్ట బుగ్గల సుందరి తాప్సీ. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని టాలీవుడ్ లో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది. అయితే కథల సెలక్షనో, లేక అమ్మడి దురదృష్టమో తెలియదు కానీ.. స్టార్ హీరోల పక్కన నటించినా కూడా విజయాలు అందలేదు. కానీ, సౌత్ హీరోయిన్ గా మాత్రం తాప్సీ మంచి అవకాశాలనే అందుకుంది.

Read Also: Johnny Nellore: కేరళ కాంగ్రెస్‌కు జానీ నెల్లూరు రాజీనామా.. బీజేపీలో చేరే అవకాశం!

ఇక టాలీవుడ్ లో దక్కని అదృష్టం.. బాలీవుడ్ దక్కుతుందేమో అని అక్కడ అడుగుపెట్టింది. కథలను మంచిగా ఎంచుకొని సౌత్ హీరోయిన్ కాస్తా లక్ కలిసొచ్చి బాలీవుడ్ హీరోయిన్ గా మారింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో దూసుకెళ్లింది. ఇక్కడవరకు బాగానే ఉంది. అయితే మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మొదట మనం నిలబెట్టిన ప్లేస్ ను మాత్రం మర్చిపోకూడదు. తాప్సీ దాన్ని మరిచి బాలీవుడ్ లో సౌత్ ఇండస్ట్రీపై ఘాటు ఆరోపణలు చేసింది. ” సౌత్ ఇండస్ట్రీ సినిమాల్లో నటించడం వలన నాకు ఎలాంటి గుర్తింపు రాలేదు. నటిగా నన్ను నేను నిరూపించుకొనే పాత్రలు సౌత్ సినిమాల్లో రాలేదు. అక్కడ స్టార్ హీరోయిన్ గా కొనసాగినా సంతృప్తి ఇచ్చే పాత్రలు చేయలేదు” అని చెప్పుకొచ్చింది. ఇక ఈ వ్యాఖ్యలపై తెలుగు అభిమానులు గుర్రుమంటున్నారు.అసలు తెలుగు సినిమాలే లేకపోతే బాలీవుడ్ కు ఎలా వెళ్లేదానివి.. ఇప్పుడు ఇలా ఎలా మాట్లాడేదానివి. ఏరు దాటాక తెప్ప తగలేస్తున్నావా.. సిగ్గులేదు అంటూ ఫైర్ అవుతున్నారు.

Show comments