The Tatas Web Series: టాటా సామ్రాజ్యం కథ వెబ్ సిరీస్‌గా.. నాలుగు తరాల చరిత్రతో ‘ది టాటాస్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Tatas Web Series: వ్యాపార ప్రపంచంలో టాటా పేరు తెలియని వాళ్ళు ఉండరు. కేవలం ఒక కంపెనీకి మాత్రమే కాదు, భారతదేశ అభివృద్ధి ప్రయాణానికి ప్రతీకగా నిలిచింది టాటా పరిశ్రమ. దేశ పారిశ్రామిక రంగాన్ని తీర్చిదిద్దిన టాటా కుటుంబ చరిత్ర ఇప్పుడు వెబ్ సిరీస్ రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. భారతీయ పరిశ్రమ, సామాజిక సేవ, విలువలు, నాయకత్వం కలగలిపిన ఈ గాథను తెరపై ఎలా ఆవిష్కరిస్తారనే ఆసక్తి ఇప్పటికే మొదలైంది. ముఖ్యంగా టాటా కుటుంబం నాలుగు తరాల ప్రయాణాన్ని ఒకే సిరీస్‌లో చూపించనున్నట్లు ప్రకటించడంతో వ్యాపారవేత్తలు, సినీ అభిమానులు, చరిత్రపై ఆసక్తి ఉన్నవారిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన ‘Made in India: A Titan Story’ విజయంతో మంచి గుర్తింపు పొందిన టీ సిరీస్ ఫిల్మ్స్, ఆల్మైటీ మోషన్ పిక్చర్ ఈ ప్రాజెక్ట్ కోసం మరోసారి చేతులు కలిపాయి. ఈసారి ‘ది టాటాస్’ పేరుతో ప్రీమియం మల్టీ సీజన్ డ్రామా సిరీస్‌ను రూపొందిస్తున్నట్లు జూలై 7న అధికారికంగా ప్రకటించాయి. ప్రముఖ జర్నలిస్టు, రచయిత గిరీష్ కుబేర్ రచించిన ‘The Tatas: How a Family Built a Business and a Nation’ పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని ఈ సిరీస్ రూపొందనుంది. ఈ పుస్తకం గజ్ క్యాపిటల్ బిజినెస్ బుక్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా అందుకోవడం విశేషం.
ఈ సిరీస్‌లో టాటా కుటుంబ చరిత్రను కేవలం వ్యాపార కోణంలో మాత్రమే కాకుండా, భారత దేశ నిర్మాణంలో వారి పాత్రను కూడా విస్తృతంగా చూపించనున్నారు. వ్యవస్థాపకుడు జంషెడ్జీ నుసెర్‌వాంజీ టాటా నుంచి ప్రారంభమయ్యే ఈ కథ, దొరబ్జీ టాటా, జె.ఆర్.డి. టాటా, రతన్ నవల్ టాటా వంటి ప్రముఖుల నాయకత్వాన్ని వివరిస్తూ నాలుగు విభిన్న తరాల ప్రయాణాన్ని తెరపైకి తీసుకురానుంది. కార్పొరేట్ నైతిక విలువలు, పారిశ్రామిక విప్లవం, దేశాభివృద్ధికి చేసిన సేవలు, సేవా కార్యక్రమాలు ఈ కథలో కీలక భాగాలుగా ఉండనున్నాయి. టీ సిరీస్ ఫిల్మ్స్ అధినేత భూషణ్ కుమార్ మాట్లాడుతూ, టాటా కుటుంబ చరిత్రను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం లభించడం గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు. ‘Made in India: A Titan Story’ కు లభించిన ఆదరణ చూస్తుంటే రియల్ స్టోరీల కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో తెలుస్తోందని ఆయన అన్నారు. భారత దేశంలో టాటా కుటుంబం పోషించిన పాత్రను కొత్త తరానికి చేరవేయడమే ఈ సిరీస్ లక్ష్యమని పేర్కొన్నారు.
Also Read
- Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
- Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్‌కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
- Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్‌కు దర్శకుడు లీగల్ నోటీసులు, సీఎం రేవంత్ కు ఫిర్యాదు!
- NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
ఈ సిరీస్‌కు ‘Made in India: A Titan Story’ కు స్క్రీన్ రైటర్‌గా పనిచేసిన కరణ్ వ్యాస్ కథను రూపొందిస్తున్నారు. లాభాలకే పరిమితం కాకుండా, సమాజ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని సంస్థలను నిర్మించిన నాయకుల కథ ఇదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ఆల్మైటీ మోషన్ పిక్చర్ సహ వ్యవస్థాపకురాలు ప్రభలీన్ సంధు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది ఒక వ్యాపార సామ్రాజ్యం కథ మాత్రమే కాదని, భారతదేశాన్ని తీర్చిదిద్దిన విలువలు, ఆలోచనలు, సంస్థల ప్రయాణమని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సిరీస్‌పై ఆసక్తి పెరుగుతున్నప్పటికీ, దర్శకుడు ఎవరు ? ప్రధాన పాత్రల్లో ఎవరు నటిస్తారు? అనే విషయాలను నిర్మాతలు ఇంకా వెల్లడించలేదు. అయితే టాటా కుటుంబం వంటి గొప్ప వారసత్వాన్ని తెరపై ఎలా ఆవిష్కరిస్తారో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
-
OTR: టీడీపీకి మింగుడుపడని ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలు
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..