Site icon NTV Telugu

Swathi Mutyam: వాయిదాను సైతం వినోదంగా చెప్పిన ఆ ఇద్దరూ!

Swathimutyam

Swathimutyam

Swathimuthyam – Release Postponed also said Happily By Those two…!

బెల్లంకొండ గణేశ్‌, వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న మూవీ ‘స్వాతి ముత్యం’. ఈ నెల 13న విడుదల కావాల్సిన ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని ఈ నిర్ణయం తీసుకున్నట్టు నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. అయితే… సినిమా విడుదల కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న వాళ్ళలో ఇద్దరు ఉన్నారు. అందులో ఒకరు హీరోగా పరిచయం అవుతున్న గణేశ్‌ కాగా… మరొకరు దర్శకుడు లక్ష్మణ్ కె.కృష్ణ! బాధాకరం ఏమంటే… ఆగస్ట్ 13 కోసం వెయ్యి కళ్ళతో వీరు ఎదురుచూస్తుంటే… మూవీ రిలీజ్ కాస్త పోస్ట్ పోన్ అయ్యింది. ఈ విషయాన్ని కూడా ఫన్నీగా హీరోహీరోయిన్లతో చిత్ర దర్శక నిర్మాతలు చెప్పించారు… ఈ వీడియో చూస్తే… ఆ విషయం మీకే తెలుస్తుంది….

Exit mobile version