Site icon NTV Telugu

Swara Bhasker: హిజాబ్ పై స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.. ద్రౌపది చీర లాగినట్లు ఉందని

swara bhasker

swara bhasker

ప్రస్తుతం కర్ణాటకను ఊపేస్తున్న వివాదం .. హిజాబ్. ముస్లిం మహిళలు హిజాబ్(తలపై వస్త్రం) లేకుండా స్కూల్స్ కి, కాలేజీలకు రావాలని అక్కడివారు పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వివాదంపై హైకోర్ట్ లో విచారణ జరుగుతుంది. ఈ వివాదంపై పలువురు ప్రముఖులు తమధైన రీతిలో స్పందిస్తూ ట్వీట్ చేస్తున్నారు. ఇక బాలీవుడ్ వివాదస్పద నటి స్వర భాస్కర్ హిజాబ్ వివాదంపై స్పందించి మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. హిజాబ్ వివాదం వింటుంటే .. మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహరణం గుర్తొస్తుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

ఆమె చేసిన ట్వీట్ ఏంటంటే ” మహాభారతంలో ద్రౌపదికి బలవంతంగా వస్ర్తాపహరణం గురించి అందరికి తెలిసిందే. ఆ సమయంలో చాలామంది గొప్పవారు, బలవంతులు, ఆపగలిగిన వారు ఉన్నా కూడా ఆ ఘటనను అలా చూస్తుండిపోయారు. అది మళ్లీ ఇప్పుడు గుర్తొంచింది” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో నెటిజన్లు ఒక్కసారిగా అమ్మడిపై మండిపడ్డారు. బికినీలు వేసుకొని తిరిగే మీరు హిందూ సంప్రదాయాల గురించి మాట్లాడుతున్నారా..? అని కొందరు.. హిందూ మతం గురించి మాట్లాడుతూ ఇస్లాం మతాన్ని నిరాకరిస్తోంది అని మరికొందరు ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version