Site icon NTV Telugu

Virupaksha: నెక్స్ట్ అప్డేట్ ఏంటి సుప్రీమ్ హీరో?

Virupaksha

Virupaksha

శివరాత్రి పండగ సంధర్భంగా… మెగా అభిమానులకి కిక్ ఇస్తూ ‘సుప్రీమ్ హీరో’ సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’ నుంచి అప్డేట్ వచ్చేసింది. “Courage Over Fear” We’re super excited about our next piece of content అంటూ SVCC ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. “మేము నా నెక్స్ట్ కంటెంట్ విషయంలో చాలా ఎగ్జైటెడ్” ఉన్నాం అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో పాటు ఒక పోస్టర్ కానీ నెక్స్ట్ ప్రమోషనల్ కంటెంట్ గురించి ఏదైనా అప్డేట్ ఇచ్చి ఉంటే బాగుండేది. అయితే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న విరూపాక్ష సినిమా గ్లిమ్ప్స్ ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంచ్ చేశాడు. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ కి, ప్లే చేసిన విజువల్స్ కూడా కలవడంతో విరూపాక్ష గ్లిమ్ప్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. ఏప్రిల్ 21న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ మూవీ నెక్స్ట్ ఎలాంటి అప్డేట్ వస్తుంది? ఎప్పుడు వస్తుంది లాంటి విషయాలు తెలియాల్సి ఉంది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్ తో కలిసి SVCC విరూపాక్షని ప్రొడ్యూస్ చేస్తుంది.  థ్రిల్లర్ జానర్ సినిమా అంటేనే యూనివర్సల్ రీచ్ ఉంటుంది, మరి ఈ సినిమాతో తేజ్ పాన్ ఇండియా హిట్ అందుకుంటాడేమో చూడాలి.

Read Also: Virupaksha: ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో ‘విరూపాక్ష’ విజువల్స్ అదిరిపోయాయి…

Exit mobile version