NTV Telugu Site icon

SVC 59: తెలుగొస్తే సంతోషం.. విశ్వక్ దారిలో దేవరకొండ?

Svc 59 Casting Call

Svc 59 Casting Call

SVC 59 Casting Call for Vijay Deverakonda- Ravikiran Kola Movie: రౌడీ హీరో విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి బడా నిర్మాత ‘దిల్’ రాజు నిర్మాణంలో ఒక ఆసక్తికర సినిమా చేయబోతున్నాడు. ఫ్యామిలీ స్టార్ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేక పోవడంతో.. ఎలాగైనా ఈసారి సాలిడ్ హిట్ కొట్టాలనే కసితో.. రూరల్ బ్యాక్ డ్రాప్‌లో మాస్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు దిల్ రాజు, విజయ్. ఈ సినిమాకు ‘రాజా వారు రాణి గారు’ ఫేమ్ రవి కిరణ్ కోలా దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటికే అనౌన్స్మెంట్ ఇచ్చారు. లేటెస్ట్‌గా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన క్యాస్టింగ్ కాల్‌ గురించి ఒక ప్రకటన ఇచ్చారు మేకర్స్. ఈ సందర్భంగా.. ‘తెలుగొస్తే సంతోషం.. గోదారి యాసొత్తే ఇంకాపేవోడే లేడు..’ అంటూ, అన్నీ ఏజ్ గ్రూప్‌ల వారికి ఛాన్స్ ఉంటుందని ప్రకటించారు. ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది మెయిల్ ఐడీతో పాటు వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు.

Online Trolling: బాయ్‌ఫ్రెండ్‌కి బ్రేక్‌అప్ తర్వాత టీనేజర్‌పై ట్రోలింగ్.. ఆత్మహత్య..

ఇక ఈ సినిమా పక్కా గోదారి బ్యాక్ డ్రాప్‌లో ఉండబోతోందని క్లియర్ కట్‌గా చెప్పేశారు మేకర్స్. అయితే.. రీసెంట్‌గా గోదారి యాసలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చేశాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. కానీ ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు విశ్వక్ దారిలో విజయ్ దేవరకొండ వెళ్తున్నాడు. దీంతో.. గోదావరి యాసలో రౌడీ బాయ్ ఎలా మెప్పిస్తాడు? అనేది ఆసక్తికరంగా మారింది. మామూలుగా అయితే.. రౌడీ మాట్లాడేది పక్కా తెలంగాణ స్లాంగ్‌. కాబట్టి.. గోదారి యాస అంటే, విజయ్ కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో రౌడీ కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉండదు. గతంలో మనోడు చేసిన డియర్ కామ్రేడ్ గోదావరి బ్యాక్ డ్రాప్ కాగా,అప్పుడు ఈ కంప్లయింట్ వినిపించింది. అయితే ఇపుడు ఈ సినిమా విషయంలో రవి కిరణ్ కోలా, విజయ్‌ని ఎలా హ్యాండిల్ చేస్తాడు? అనేది చూడాలి.

Show comments