భాషతో సంబంధం లేకుండా వివిధ వెబ్ సిరీస్లు ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అలా 2022 లో వచ్చిన తమిళ వెబ్సెరీస్ ‘సుడల్: ది వొర్టెక్స్’ ఒకటి. కథిర్, ఐశ్వర్య రాజేశ్, ఆర్.పార్తిబన్, హరీశ్ ఉత్తమన్, శ్రియారెడ్డి కీలకపాత్రల్లో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ను పుష్కర్-గాయత్రి క్రియేట్ చేయగా, బ్రహ్మ జి – అనుచరణ్ మురుగేయాన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సిరీస్ తమిళంతో పాటు, 30 భాషల్లో విడుదలైన మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు, వివిధ ఓటీటీ అవార్డులు సైతం సొంతం చేసుకుంది.
Also Read:Re-release: స్వీట్ మెమోరీస్ పుట్టుకొస్తున్న ‘నా ఆటోగ్రాఫ్’
దీంతో ఈ సిరీస్ వీక్షకులు దానికి సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఇప్పుడు ఈ సీరీస్ కొనసాగింపుగా ‘సుడల్: ది వొర్టెక్స్’ విడుదలకు సిద్ధమైంది. సీజన్-1లో ఉన్న పాత్రలతో పాటు, ఈసారి మంజిమా మోహన్, కాయల్ చంద్రన్ తదితరులు అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ నేల ఫిబ్రవరి 28 నుంచి ఈ సుడల్ సీజన్-2 స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అమెజాన్ ప్రైమ్ వీడియో తో పాటుగా కొత్త పోస్టర్ కూడా పంచుకుంది.