Site icon NTV Telugu

Yash: ఇంకా వీడని ఆ సస్పెన్స్..!

Yash Next Project

Yash Next Project

స్టార్ హీరోలందరూ ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే, మరో సినిమాని లైన్‌లో పెట్టేస్తారు. జయాపజయాలతో సంబంధం లేకుండా, వరుసగా సినిమాల్ని చేసుకుంటూ పోతుంటారు. కానీ, ఈ ఏడాది ‘కేజీఎఫ్: చాప్టర్2’తో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన కన్నడ హీరో యశ్ మాత్రం ఇంతవరకూ ఎలాంటి ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. నిజానికి.. కేజీఎఫ్ ప్రాజెక్ట్‌ను గాడిలో పెట్టినప్పటి నుంచి, అంటే 2015 నుంచి యశ్ మరో సినిమా ఒప్పుకోలేదు. పూర్తిగా దీని మీదే ఫోకస్ పెట్టాడు. ఇది భారీ ప్రాజెక్ట్ కాబట్టి, దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. అందుకే, మధ్యలో వచ్చిన పలు ఆఫర్లను ఇతను సున్నితంగా తిరస్కరించాడు.

పోనీ.. కేజీఎఫ్2 రిలీజైన తర్వాతైనా ఏదైనా ప్రాజెక్ట్‌ని అనౌన్స్ చేస్తాడని అనుకుంటే, ఇప్పటిదాకా యశ్ నుంచి ఎలాంటి ప్రకటనా లేదు. ఆమధ్య ఓ కన్నడ దర్శకుడితో తదుపరి సినిమాకి ఈ హీరో ప్లాన్ చేస్తున్నట్టు ఒక గాసిప్ గుప్పుమంది కానీ, అది నిజమా? కాదా? అన్నది ఇంకా తెలియరాలేదు. బహుశా.. కేజీఎఫ్ సిరీస్ కారణంగా పాన్ ఇండియా స్టార్‌గా అవతరించాడు కాబట్టి, పాన్ ఇండియా సబ్జెక్టుల్నే ఎంపిక చేయాలన్న ఉద్దేశంతో ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. తనకొచ్చిన క్రేజ్‌ని తగినట్టు, ఓ పర్ఫెక్ట్ సబ్జెక్ట్ కోసం వేచి చూస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ తాను తీసుకునే నిర్ణయం తేడా కొడితే, కేజీఎఫ్‌తో సాధించిన ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే, లేటుగా అయినా లేటెస్టుగా ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో రావాలని యశ్ డిసైడ్ అయినట్టు అర్థమవుతోంది. మరి, ఇది ఎప్పుడు అనౌన్స్ చేస్తాడో చూడాలి.

Exit mobile version