Yash: ఇంకా వీడని ఆ సస్పెన్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరోలందరూ ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే, మరో సినిమాని లైన్‌లో పెట్టేస్తారు. జయాపజయాలతో సంబంధం లేకుండా, వరుసగా సినిమాల్ని చేసుకుంటూ పోతుంటారు. కానీ, ఈ ఏడాది ‘కేజీఎఫ్: చాప్టర్2’తో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన కన్నడ హీరో యశ్ మాత్రం ఇంతవరకూ ఎలాంటి ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. నిజానికి.. కేజీఎఫ్ ప్రాజెక్ట్‌ను గాడిలో పెట్టినప్పటి నుంచి, అంటే 2015 నుంచి యశ్ మరో సినిమా ఒప్పుకోలేదు. పూర్తిగా దీని మీదే ఫోకస్ పెట్టాడు. ఇది భారీ ప్రాజెక్ట్ కాబట్టి, దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. అందుకే, మధ్యలో వచ్చిన పలు ఆఫర్లను ఇతను సున్నితంగా తిరస్కరించాడు.
పోనీ.. కేజీఎఫ్2 రిలీజైన తర్వాతైనా ఏదైనా ప్రాజెక్ట్‌ని అనౌన్స్ చేస్తాడని అనుకుంటే, ఇప్పటిదాకా యశ్ నుంచి ఎలాంటి ప్రకటనా లేదు. ఆమధ్య ఓ కన్నడ దర్శకుడితో తదుపరి సినిమాకి ఈ హీరో ప్లాన్ చేస్తున్నట్టు ఒక గాసిప్ గుప్పుమంది కానీ, అది నిజమా? కాదా? అన్నది ఇంకా తెలియరాలేదు. బహుశా.. కేజీఎఫ్ సిరీస్ కారణంగా పాన్ ఇండియా స్టార్‌గా అవతరించాడు కాబట్టి, పాన్ ఇండియా సబ్జెక్టుల్నే ఎంపిక చేయాలన్న ఉద్దేశంతో ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. తనకొచ్చిన క్రేజ్‌ని తగినట్టు, ఓ పర్ఫెక్ట్ సబ్జెక్ట్ కోసం వేచి చూస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ తాను తీసుకునే నిర్ణయం తేడా కొడితే, కేజీఎఫ్‌తో సాధించిన ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే, లేటుగా అయినా లేటెస్టుగా ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో రావాలని యశ్ డిసైడ్ అయినట్టు అర్థమవుతోంది. మరి, ఇది ఎప్పుడు అనౌన్స్ చేస్తాడో చూడాలి.
Also Read
- Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
- Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న 'చెన్నై లవ్ స్టోరీ' దర్శకుడు!
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!