Site icon NTV Telugu

Sushmita Sen: హిజ్రాగా మారిన సుస్మితా సేన్.. లలిత్ మోడీ ప్రభావమా..?

Sushmitha

Sushmitha

Sushmita Sen: బాలీవుడ్  స్టార్ హీరోయిన్ సుస్మితా సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె నటన, అచీవ్ మెంట్స్, ఇక ఆమె ప్రేమాయణాలు అబ్బో అన్ని  సంచలనమే. ఇక మొన్నటికి మొన్న ఐపీఎల్ కింగ్ లలిత్ మోడీ తో ప్రకటించి షాక్ ఇచ్చిన ఈ బ్యూటీ తాజాగా హిజ్రాగా మారి షాకిచ్చింది. ఏంటి నిజమా అని ఆశ్చర్యపోకండి.. అదంతా సినిమా కోసమే.. ఆర్య వెబ్ సిరీస్ తో రీ ఎంట్రీ ఇచ్చిన సుస్మితా మంచి విజయాన్ని అందుకొంది. ఇక ఆ సిరీస్ తరువాత ఛాలెంజింగ్ పాత్రల్లోనే కనిపించాలని నిర్ణయించుకున్న ఈ భామ తాజాగా ఒక రియల్ ట్రాన్స్ జెండర్ కథతో తాలి అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. మగా, ఆడ కాకుండా మరో జెండర్ ను కూడా లీగల్ గా చేయాలనీ పోరాడిన ట్రాన్స్ జెండర్ గౌరీ సావంత్ కథ ఇది.

గౌరీ అసలు పేరు గణేష్.. అతను తనలోని లోపాన్ని అందరు ఎగతాళి చేస్తున్నా దైర్యంగా నిలబడి గౌరీగా మారి తనలాంటి వారికోసం పోరాడిన ఆమె కథ ఎంతో స్ఫూర్తిదాయకం. ఇక ఆ పాత్రలో సుస్మితా  నటించింది. ఇక ఈ సిరీస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. సూదిలాంటి చూపుతో రెండు చేతులు కొడుతూ అచ్చు గుద్దినట్లు రియల్ ట్రాన్స్ జెండర్ ను గుర్తుచేస్తోంది సుస్మిత. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ పోస్టర్ పై నెటిజన్స్ తమదైన రీతిలో స్పందిస్తున్నారు.  లలిత్ మోడీ ప్రభావమా..? హిజ్రాగా మారిపోయావు అని కొందరు.. ? సూపర్.. సుస్మితా  నీ నటనతో అదరగొట్టు అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version