NTV Telugu Site icon

Sushmita Sen: ఒక పక్క లలిత్ మోదీతో ప్రేమాయణం.. మరోపక్క మాజీ ప్రియుడితో

Sushmitha

Sushmitha

Sushmita Sen: బాలీవుడ్ సీనియర్ హెరాయిన్ సుస్మితా సేన్ పద్దతి నచ్చడం లేదని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క ఒకరితో రిలేషన్ లో ఉండి ఇంకోపక్క మాజీ ప్రియుడితో షికార్లు ఏంటని ప్రశ్నిస్తున్నారు. బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో సుస్మితా సేన్ ఒకరు. ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా పిల్లలను దత్తత తీసుకొని తల్లిగా మారిన ఈ బ్యూటీ ప్రేమాయణాలకు మాత్రం కొదువ లేదు. తనకన్నా చిన్నవాడైన నటుడు రోహమన్ తో చెట్టాపట్టాలేసుకొని తిరిగి, సహజీవనం చేసిన ఈ జంట సడెన్ బ్రేకప్ చెప్పుకొని విడిపోయారు. ఇక రోహమన్ నుంచి విడిపోయిన కొద్దిరోజులకే సుస్మితా ఐపీఎల్ కింగ్ లలిత్ మోదీతో ప్రేమాయణం మొదలుపెట్టింది. ఈ విషయాన్ని వారు ఇద్దరు అధికారికంగా ప్రకటించారు. పెళ్లి గురించి ఇప్పుడే ఆలోచించడం లేదు కానీ, ప్రేమలో అయితే ఉన్నామని చెప్పుకొచ్చారు. అప్పట్లో ఈ వార్త పెను సంచలానాన్నే సృష్టించింది.

ఇక లలిత్ ప్రేమను ప్రకటించి పట్టుమని పదిరోజులు కూడా కాకముందే సుస్మితా మాజీ ప్రియుడు తో కారులో కనిపించింది. ఇప్పుడేమో షాపింగ్ చేస్తూ కనిపించింది. దీంతో నెటిజన్లు ఆమెపై ఆరహం వ్యక్తం చేస్తున్నారు. లలిత్ ను సైడ్ చేసి మాజీ ప్రియుడను మళ్లీ సెట్ చేసుకుంటుందా..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే రోహమన్, సుస్మిత బిడ్డలకు తండ్రి.. అదేనండీ ఇద్దరు కలిసి దత్తత పిల్లలను పెంచుతున్నారు. వారి కోసమే రోహామాన్ సుస్మితను కలుస్తున్నాడని, వారి ఆనందం కోసమే ఇలా షాపింగ్ లు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి రోహామాన్ ప్లేస్ ను తీసుకోవాలనుకుంటున్న లలిత్ ఎక్కడ..? అతడెందుకు పిల్లలను పట్టించుకోవడం లేదు అంటూ ఆరాలు తీస్తున్నారు. ప్రస్తుతం ఈ జంట ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments