Sushmita Sen: పదే పదే అక్కడ టచ్ చేశాడు.. వద్దని తలూపాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sushmita Sen Reveals Her Bad Experience In Public Event: కథానాయికలు పబ్లిక్‌లో కనిపించినప్పుడు.. వారిని చూసేందుకు, కలిసి ఫోటో దిగేందుకు అభిమానులు ఎగబడుతుంటారు. ఇలాంటి సమయంలోనే కొందరు ఆకతాయిలు అసభ్యకరమైన పనులకి పాల్పడుతుంటారు. గుంపులో ఏం చేసినా గుర్తించరన్న భావనతో.. తారల్ని అసభ్యంగా తాకేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి పాడు పనులు చేసి, కొందరు అడ్డంగా బుక్కైన సందర్భాలున్నాయి. కథానాయికలు సైతం అప్పటికప్పుడే వారికి తగిన గుణపాఠాలూ నేర్పారు. తనకూ అలాంటి సందర్భమే ఒకటి ఎదురైందని, తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వాడికి ఆ సమయంలోనే గట్టిగా సమాధానం ఇచ్చానని మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ చెప్పింది.
‘‘నేను ఒక ఈవెంట్‌కి హాజరైనప్పుడు.. చుట్టూ చాలామంది అబ్బాయిలు గుమికూడారు. అప్పుడు ఒక చెయ్యి, పదే పదే నన్ను అసభ్యంగా తాకడాన్ని గమనించాను. మొదట్లో ఆ గుంపులో అనుకోకుండా చెయ్యి తగిలిందేమోనని అనుకున్నా. కానీ, కావాలనే తాకుతున్నట్టు గ్రహించి, వెంటనే ఆ చెయ్యి పట్టుకొని ముందుకు లాగాను. తీరా చూస్తే.. ఆ చెయ్యి పదిహేనేళ్ల అబ్బాయిదని తెలిసి షాక్‌కి గురయ్యా. అతడు చేసిన పనికి నేను ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు కానీ, పదిహేనేళ్ల కుర్రాడే కావడంతో అతడ్ని పక్కకు తీసుకెళ్లాను. ‘ఇప్పుడు నేను గట్టిగా అరిచి, ఏడ్చి గోల పెడితే.. నీకు జీవితమే లేకుండా పోతుంది. ఇది నీకు ఓకేనా’ అని అడిగాను. అందుకు అతడు వద్దని తలూపాడు. ఇంకెప్పుడూ అలా చేయనని మాటిచ్చాడు’’ అంటూ సుస్మితా చెప్పుకొచ్చింది.
Also Read
- Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
- Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
పిల్లలు అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదన్న విషయాన్ని మనమే నేర్పించాలని సుస్మితా సూచించింది. అలాంటి పాడు పనులు చేయడం పెద్ద తప్పన్న గుణపాఠాల్ని సరైన రీతిలో నేర్పించాలని పేర్కొంది. కాగా.. చివరగా సుస్మితా ‘ఆర్య’ అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది. ప్రస్తుతం ‘తాళి’లో ట్రాన్స్ వుమెన్‌గా నటిస్తోంది. ఈ పాత్రలో నటించడం తనకు ఛాలెంజింగ్‌గా ఉందని సుస్మితా వెల్లడించింది.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!