Sushmitha Sen: గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్లు అంటే అందరి సొంతం.. ప్రతి ఒక్కరు వారి జీవితంపై కామెంట్స్ చేస్తూనే ఉంటారు. సోషల్ మీడియా వచ్చాకా వారు ఎలా జీవించాలి..? ఎవరితో జీవించాలి అనేది కూడా చెప్పేస్తున్నారు కొంతమంది. ప్రస్తుతం మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ ను నెటిజన్స్ ఆడేసుకుంటున్నారు. మాజీ ఐపీఎల్ కింగ్ లలిత్ మోడీతో సుస్మితా డేటింగ్ చేస్తోంది అని తెలిసినప్పటి నుంచి చాలామంది ఆమెను ట్రోల్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఆమె గోల్డ్ డిగ్గర్.. డబ్బుకోసం ఎలాంటి వారితోనైనా ఉంటుంది.. డబ్బుకు అమ్ముడుపోయి లలిత్ దగ్గరకు వెళ్లింది.. అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈ ట్రోలర్స్ గట్టి కౌంటర్ ఇచ్చింది సుస్మితా.
ఇన్స్టాగ్రామ్ లో నడి సముద్రంలో కూర్చొని ఉన్న ఒక ఫోటోను షేర్ చేస్తూ “నా జీవితం, నా మనసాక్షిపై కేంద్రీకృతమై ఉంది. నా చుట్టూ ఉన్న దయనీయ ప్రపంచాన్ని చూస్తుంటే నాకు బాధేస్తోంది. నేనెప్పుడు చూడనివారు.. నాకసలు పరిచయం లేని మిత్రులు నా జీవితంపై హక్కు ఉన్నట్లు మాట్లాడుతున్నారు. నేనొక గోల్డ్ డిగ్గర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి నాకు గోల్డ్ కన్నా డైమండ్స్ అంటే చాలా ఇష్టం. నేను వాటిని సొంతంగా కొనుక్కోగలను. ఈ విషయం అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. మీ సుష్ బాగానే ఉందని తెలుసుకోండి. మీ ఆమోదం, పొగడ్తలతో నేను నా జీవితాన్ని గడపలేదు. ఇక ఇటువంటి సమయంలోనూ నాకు మద్దతుగా నిలిచినా అభిమానులకు, స్నేహితులకు ధన్యవాదాలు” అంటూ చెప్పుకొచ్చింది. ఎంతో సున్నితంగా మాట్లాడినా ట్రోలర్స్ కు సుస్మితా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Sushmitha Sen latest Instagram Post: