Sushanth Singh Rajputh: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఇంకా జీర్ణించుకోలేనిది. చిన్న వయస్సులోనే డిప్రెషన్ కు గురై తన ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మాహత్య చేసుకున్నాడు . అయితే అది ఆత్మహత్య కాదని హత్యే అని ఇప్పటికి ఆ కేసు నడుస్తోనే ఉంది. ఎంతో కష్టపడి పైకి వచ్చిన హీరోలో సుశాంత్ ఒకడు. సీరియల్ హీరోగా కెరీర్ మొదలుపెట్టి స్టార్ హీరోగా ఎదిగిన అతని ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. కానీ, అతని మరణం ఒక పెద్ద మిస్టరీగా మారింది. దాదాపు మూడేళ్ళ నుంచి ఈ కేసు నడుస్తోనే ఉంది. ఇదిలా ఉంటే. సుశాంత్ మరణించిన దగ్గర నుంచి అతని ప్లాట్ ఖాళీగానే ఉంది. ఇక ఇన్నాళ్లకు ఆ ఇంటిని అద్దెకు ఇవ్వనున్నారు.
ఆత్మహత్య చేసుకున్న ఇంట్లో దిగడానికి చాలామంది భయపడతారు. కానీ, ఒక కుటుంబం మాత్రం ధైర్యం చేసి ఆ ఇంటిలో అద్దెకు ఉండడానికి ఒప్పుకుందని టాక్.. సుశాంత్ ఇల్లు ఎంతో విశాలంగా ఉంటుంది. అతని టేస్ట్ కు తగ్గట్టు దగ్గర ఉండి డిజైన్ చేయించుకున్నాడు.అప్పట్లోనే ఆ ఇంటికి నెలకు రూ. 4 లక్షల వరకు అద్దె చెల్లించేవాడు సుశాంత్. అతను ఆత్మహత్య చేసుకున్నాకా ఎవరు ఆ ఇంటికి అద్దెకు రాకపోవడంతో.. కేవలం లక్ష రూపాయలకే ఇస్తున్నారట. ఇక ఆ ఇంటి అద్దె నెలకు రూ. లక్ష.. ముందుగా రూ. 30 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మరి ఆ కుటుంబం ఎప్పుడు దిగుతుంది..? దిగాకా ఏదైనా సమస్య ఉంటుందా..? అనేది తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.