Site icon NTV Telugu

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇంట తీవ్ర విషాదం..

sushanth sing rajputh

sushanth sing rajputh

దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. బీహార్ లోమంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కుటుంబ సభ్యులు మృత్యువాత పడ్డారు. సుశాంత్ బంధువు ఓం ప్రకాష్ సోదరి అంత్యక్రియలకు బంధువులందరు హాజరయ్యారు. అనంతరం మంగళవారం ఉదయం కారులో 10 మంది తిరిగి పాట్నాకు బయల్దేరారు.

లఖిసరాయ్‌ జిల్లా వద్దకు వచ్చేసరికి కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు సంఘటనా స్థలంలోనే మృతిచెందగా, మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మరణించిన వారిలో సుశాంత్‌ మేనల్లుడు సహా బావ, హర్యానా కేడర్‌ ఐపీఎస్‌ ఓం ప్రకాశ్‌ సింగ్‌ సమీప బంధువులు ఉన్నారు. దీంతో మరోసారి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

Exit mobile version