NTV Telugu Site icon

Suriya : సూర్య డైరెక్ట్ తెలుగు సినిమా ఫిక్స్.. దర్శకుడు ఎవరేంటే.?

Suriya

Suriya

తమిళ హీరో సూర్య కు తమిళ్ తో పాటు తెలుగులోను మంచి మార్కెట్ ఉంది. ఇంకా చెప్పాలి అంటే తమిళ్ కంటే ఎక్కువ తెలుగులో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు ఉన్నాయి. సూర్య నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ గతేడాది రీరిలీజ్ చేయగా సూపర్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే  సూర్య స్ట్రయిట్ తెలుగు ఎప్పుడు చేస్తాడా అని ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు. సూర్య కూడా త్వరలోనే తెలుగు సినిమా చేస్తానని కంగువ ప్రమోషన్స్ లో తెలిపాడు.

Also Read : Rukshar Dhillon : గుబులు పుట్టిస్తున్న రుక్సర్ థిల్లాన్‌ స్టన్నింగ్ ఫోజులు..

కాగా ఇన్నాళ్లకు ఆ టైమ్ వచ్చినట్టు టాలివుడ్ సర్కిల్స్ లో జోరుగా చర్చ నడుస్తుంది. సూర్య స్ట్రయిట్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దర్శకుడు ఎవరు అనేది క్లారిటి రాలేదు. వాస్తవానికి గతంలోనే సూర్య స్ట్రయిట్ తెలుగు సినిమా చేస్తున్నాడు అనే వార్తలు వచ్చాయి. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఓ సినిమా చేస్తాడని న్యూస్ హల్ చల్ చేసింది. కానీ అవేవి నిజం కాలేదు. గతేడాది సూర్య నటించిన కంగువా డిజాస్టర్ కావడంతో సినిమాల ఎంపికలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. కాంబినేషన్ కంటే కూడా కథలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తెలుగు దర్శకుడి సినిమాకు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. వినిపిస్తున్న సమాచారం ప్రకారం సూర్యతో సినిమా చేయబోయే దర్శకుల లిస్ట్ లో బోయపాటి శ్రీను, యంగ్ దర్శకుడు వెంకీ అట్లూరి, తండేల్ దర్శకుడు చందు మొండేటి పేర్లు వినిపిస్తున్నాయి. మరి సూర్య డైరెక్ట్ చేయబోయే ఆ డైరెక్టర్ ఎవరనేది మరికొద్ది రోజులు ఆగితే గాని క్లారిటీ రాదు.