Site icon NTV Telugu

‘జై భీమ్’ మరో అరుదైన ఫీట్… ఇంటర్నేషనల్ అవార్డ్స్ లో ఎంట్రీ !

jai-bhim

jai-bhim

ఈ ఏడాది బ్లాక్‌ బస్టర్ హిట్‌గా నిలిచిన సూర్య చిత్రం “జై భీమ్” విడుదలైనప్పటి నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉంది. అవి ప్రశంసలైనా, వివాదాలైనా ‘జై భీమ్’ సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు. తాజాగా ఈ సినిమా మరో అరుదైన ఫీట్ సాధించింది. హృదయాన్ని ద్రవింపజేసే ఈ చిత్రం ఇచ్చిన సందేశం రాష్ట్రవ్యాప్తంగా వివాదాలకు నెలవు కాగా, అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ చిత్రం ఇంటర్నేషనల్ అవార్డ్స్ లో ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ చిత్రం అధికారికంగా గోల్డెన్ గ్లోబ్స్ 2022లోకి ప్రవేశించి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది.

“జై భీమ్” ఇప్పుడు అధికారికంగా గోల్డెన్ గ్లోబ్స్ 2022లో ‘బెస్ట్ నాన్-ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్’ విభాగంలో నామినేషన్‌గా ప్రవేశించింది. ఈ చిత్రం ‘ది షావ్‌శాంక్ రిడంప్షన్’, ‘ది గాడ్‌ ఫాదర్’ ఐఎండిబిలో రికార్డు స్థాయి రేటింగ్‌లను బ్రేక్ చేసి మొదటి స్థానంలో 9.6 రేటింగ్ తో నిలిచి అరుదైన ఘనత సాధించింది.

Read Also : ఖండ ఖండాలలో ‘అఖండ’ జాతర… ‘లవ్ స్టోరీ’ రికార్డు బ్రేక్

ఈ చిత్రం విమర్శకులు, ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకున్నప్పటికీ విడుదలైన తర్వాత వివాదంలో చిక్కుకుంది. తమ కమ్యూనిటీని కించపరిచేలా చూపించినందుకు వన్నియార్ సంగం లీగల్ నోటీసు జారీ చేసింది. ఆ తర్వాత సూర్యకి హత్య బెదిరింపులు వచ్చాయి. ఆ సమయంలో చెన్నైలోని సూర్య నివాసం వద్ద సాయుధ భద్రతా సిబ్బందిని మోహరించారు. అంతేకాదు సినిమాలో ప్రకాష్ రాజ్‌ ఓ వ్యక్తిని చెంప దెబ్బ కొట్టే సన్నివేశం కూడా వివాదాస్పదమైంది. ప్రకాష్ రాజ్ హిందీ మాట్లాడే పాన్ బ్రోకర్‌ని తమిళంలో మాట్లాడమని చెంపదెబ్బ కొట్టినట్లు చూపించిన సన్నివేశంపై బాలీవుడ్ ప్రేక్షకులు మండిపడ్డారు.

ఇరులర్ తెగకు చెందిన సెంగాని భర్త రాజకన్నును తప్పుడు కేసులో ఇరికించినప్పుడు, సెంగాని (పార్వతి జీవితం ఆధారంగా), న్యాయవాది చంద్రు నేతృత్వంలోని కీలక న్యాయ పోరాటానికి సంబంధించిన కథను “జై భీమ్” చెబుతుంది. ఈ కేసులో పోలీసుల దౌర్జన్యం కారణంగా 1993లో రాజకన్ను మరణించాడు.

Exit mobile version