Site icon NTV Telugu

ET : సూర్య మూవీ ఓటిటి రిలీజ్ కు టైమ్ ఫిక్స్

ET

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇటీవల “ఎతర్క్కుం తునిందావన్” అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ థియేటర్లలో అభిమానులను, ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందించారు. అయితే తాజాగా ఈ సినిమా ఓటిటి విడుదలకు సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్, సన్ ఎన్‌ఎక్స్‌టి దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Read Also : James : పునీత్ రాజ్ కుమార్ లాస్ట్ మూవీ… ఓటిటి రిలీజ్ కు రెడీ

“ఎతర్క్కుం తునిందావన్” చిత్రం “ఈటీ” పేరుతో తెలుగులోనూ విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్టు 7న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుందనేది తాజా అప్డేట్. అయితే “ఈటీ” సన్ నెక్స్ట్ లో విడుదలవుతుందా ? లేదా ? అనే విషయంపై సందేహం నెలకొంది. ఎందుకంటే సన్ నెక్స్ట్ తన ప్లాట్‌ఫామ్‌లో “ఈటీ” సినిమా స్ట్రీమింగ్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఒకే తేదీన సన్ ఎన్‌ఎక్స్‌టి అండ్ నెట్ ఫ్లిక్స్ కూడా దీన్ని ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంచుతాయని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ తమిళ మూవీ అన్ని ప్రధాన దక్షిణ భారత భాషలతో పాటు హిందీలో కూడా ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది.

Exit mobile version