Suriya: రోలెక్స్ పాత్ర నాకు ఇష్టం లేదు.. సూర్య సెన్సేషనల్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన కథలను ఎంచుకొని హిట్ అందుకోవడంలో సూర్య తరువాతే ఎవరైనా.. ఇక ఇటీవలే విక్రమ్ సినిమాలో రోలెక్స్ పాత్రలో నటించి మెప్పించిన సూర్య ఆ పాత్రకు ప్రాణం పోశాడని చెప్పాలి. విక్రమ్ సినిమాలో ఉన్న కమల్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ లో 10 నిముషాలు ఉండే సూర్య పాత్ర ఒక ఎత్తు. ఈ సినిమాకు ప్రాంమ్ పోసింది సూర్యనే అని చెప్పడంలో కూడా అతిశయోక్తి కాదు. అయితే ఆ పాత్రను సూర్య ఇష్టం లేకుండానే చేశాడట. ఈ విషయాన్ని సూర్యనే స్వయంగా చెప్పుకొచ్చాడు.
తాజాగా జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రదానోత్సవంలో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న సూర్య మాట్లాడుతూ “నేను ఈ స్థాయిలో ఇలా నిలబడిగలిగాను అంటే అందుకు కమల్ హాసన్ గారే స్ఫూర్తి. ఆయన ఫోన్ చేసి విక్రమ్ లో ఒక పాత్ర ఉందని చెప్పగానే దాన్ని వదులుకోవాలనిపించలేదు. కొన్ని పాత్రలు చేయాలంటే భయం ఉంటుంది. కానీ అలా భయపెట్టింది చేస్తేనే ఎదుగగలం అని నమ్ముతాను. అందుకే ఓకే చెప్పాను. నిజానికి లోకేశ్ ఫోన్ చేసి ఈ పాత్ర చేయమని అడిగితే చేయను అని చెప్పేద్దాం అనుకున్నాను. కానీ, కమల్ హాసన్ గారి కోసం ఈ పాత్ర చేయాలనిపించింది.. లోక నాయకుడు కమల్ హాసన్ గారి కోసమే రోలెక్స్ పాత్ర ఇష్టం లేకున్నా చేశాను” అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ పాత్ర కోసం సూర్య పారితోషికం కూడా తీసుకోలేదు. సినిమా విజయం అందుకున్న తరువాత కమల్, సూర్యకు రోలెక్స్ వాచ్ ను గిఫ్ట్ గా ఇచ్చిన విషయం విదితమే. ఏది ఏమైనా సూర్య కెరీర్ లో రోలెక్స్ పాత్ర నిలిచిపోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇష్టం లేకుండా చేసినా సూర్యకు మంచే జరిగిందని అభిమానులు చెప్పుకొస్తున్నారు.
Also Read
- NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
- Ranabaali: ఇప్పుడు రష్మిక – విజయ్ వంతు.. ఈ వారంలోనే ‘రణబాలి’ బిగ్ సర్ప్రైజ్? అసలు ట్విస్ట్ ఇదే!
- Samantha Ruth Prabhu: ‘ఇంతకంటే ఎక్కువ వద్దు’ అంటున్న సమంత! ఇంతకీ దేని గురించో తెలుసా?
- Yash’s Toxic: యశ్‌కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
- Tags
- Kamal Haasan
- rolex
- Suriya
- Vikram
తాజావార్తలు
-
IND vs SL: జడేజా ఖాతాలో చెత్త రికార్డు.. అందులో నంబర్ వన్!
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లాటరీకి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే.?
-
NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
-
Russia: రష్యాలో గ్యాస్ కెమికల్ కాంప్లెక్స్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
-
Healthy Lifestyle: ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకాలని ఉందా.. ఈ టైమ్‌లోనే బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ చేయండి!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..