Site icon NTV Telugu

Jai Bhim : సూర్య అభిమానులకు తీవ్ర నిరాశ… ‘జై భీమ్’కు ఆస్కార్ మిస్

jai-bhim

jai-bhim

నిన్న ఎంతో ఆశతో ఎదురు చూసిన సూర్య అభిమానులకు తీవ్ర నిరాశ తప్పలేదు. టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన సూర్య కోర్ట్‌ డ్రామా “జై భీమ్” ఆస్కార్ 2022 లో పాల్గొనలేకపోయింది. సూర్య అభిమానులు నిరాశకు గురైనప్పటికీ, ‘జై భీమ్’ చిత్రం అంతర్జాతీయ స్థాయికి వెళ్లడంతో చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. ‘జై భీమ్‌’ ఆస్కార్‌ రేసు నుంచి ఔట్ అవ్వడంపై అభిమానులు, సినీ ప్రముఖులు ట్విట్టర్‌లో స్పందించారు. 94వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ చిత్రం విభాగంలో పోటీ చేసేందుకు అర్హత సాధించిన 276 చిత్రాలలో ఒకే ఒక్క తమిళ మూవీ “జై భీమ్”.

Read Also : ‘భీమ్లా నాయక్’ ఈజ్ బ్యాక్… ఫిబ్రవరి రేసులోనే !

నిన్న రాత్రి 7 గంటలకు ‘జై భీమ్’ గురించి బిగ్ అనౌన్స్మెంట్ వస్తుందనే ఆశతో, ఆ వార్తను చూడటానికి యావత్ భారతదేశం మొత్తం ఎంతో ఉత్సాహంతో, ఉత్కంఠతతో ఎదురు చూసింది. అయితే దురదృష్టవశాత్తు ‘జై భీమ్’ ఆస్కార్ అవార్డుల నుండి ఔట్ అని ప్రకటించారు. కానీ సూర్య అభిమానులు మాత్రం సినిమా అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నందుకు చాలా గర్వంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. గత ఏడాది నవంబర్ 2న విడుదలైన గ్రిప్పింగ్ కోర్ట్‌ రూమ్ డ్రామా భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక భారతీయ చిత్రం ‘రైటింగ్ విత్ ఫైర్’ ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ కేటగిరీలో ఎంపికైంది. 94వ అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఫిల్మ్ కేటగిరీలో మొత్తం 276 సినిమాలు పోటీ పడ్డాయి. వీరిలో 10 మంది మాత్రమే షార్ట్‌లిస్ట్‌లో ఉన్నారు. మొత్తం 23 కేటగిరీలలోని నామినేషన్లను ట్రేసీ ఎల్లిస్ రాస్, లెస్లీ జోర్డాన్ నిన్న ప్రకటించారు.

Exit mobile version