Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా కోసం పెట్టే డెడికేషన్ కు గుడికట్టినా తప్పులేదు అంటారు అభిమానులు. ఇక ప్రయోగాలకు కేరాఫ్ అడ్రెస్స్ అంటే సూర్య గురించే చెప్పుకొస్తారు. పాత్ర కోసం బరువు పెరగాలన్నా, తగ్గాలన్నా.. ఎలాంటి పాత్రకు తగ్గ బాడీని అలా దింపేస్తాడు. మొదటినుంచి ఫిట్ నెస్ ఫ్రీక్ అయిన సూర్య.. ఇద్దరు బిడ్డల తండ్రి అయినా ఇంకా పెళ్లికాని కుర్రాడిలానే ఉంటాడు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సూర్య .. మరో ప్రయోగానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సూర్య శివ దర్శకత్వంలో భారీ పీరియాడిక్ సినిమా ‘కంగువ’ ను చేస్తున్న సూర్య అందులో యుద్ధ వీరుడుగా కనిపించనున్నాడు.. దీనికోసం చాలానే కష్టపడి ఫిజిక్ ను మెయింటైన్ చేస్తున్నాడు.
SSMB 28: ‘అమరావతికి అటు ఇటు’గా మహేష్ బాబు?
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కంగువ సినిమాలో సూర్య డబుల్ రోల్ లో కనిపించనున్నాడట. దానికోసం బరువు పెరిగినట్లు తెలుస్తోంది. తాజాగా సూర్య బరువు పెరిగిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. గుబురు గడ్డం, బుగ్గలు వచ్చి.. అసలు సూర్య పోలికలే లేవు. అయితే అందులో ఉన్నది సూర్యనే. ఈ ఫోటో చూస్తుంటే సూర్య ఏదో భారీగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇకపోతే ప్రస్తుతం సూర్య కొడైకెనాల్ లో ఫ్యామిలీ తో హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. అది ముగించుకొని ఇంటికి తిరిగి రాగానే ఆయన కంగువ షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఇక ఈ ఫోటో చూసిన వారందరు.. నో..ఈయన మా సూర్య కాదు.. ఈయన ఎవరో అని చెప్పుకొస్తున్నారు. మరి ఈ చిత్రంతో సూర్య ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.