Viswanath & Sons: 16 రోజులైనా తగ్గని జోరు.. రూ.240 కోట్ల క్లబ్‌లోకి సూర్య సినిమా

Viswanath Sons 300kb

Viswanath Sons 300kb

Viswanath & Sons: ఒక సినిమా థియేటర్లలోకి భారీ వసూళ్లు సాధించడం పెద్ద విషయం కాదు. అయితే కొత్త సినిమాలు వరుసగా విడుదలవుతున్న సమయంలో కూడా అదే జోరును కొనసాగించడం మాత్రం అంత సులభం కాదు. ప్రస్తుతం సూర్య నటించిన ‘విశ్వనాథ్ & సన్స్’ ఇదే తరహా విజయాన్ని అందుకుంటోంది. విడుదలై 16 రోజులు పూర్తయినా ఈ ఫ్యామిలీ డ్రామా బాక్సాఫీస్ వద్ద స్థిరమైన వసూళ్లను కొనసాగిస్తూనే ఉంది. సూర్య కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ (Vishwanath & Sons) థియేటర్లలో విడుదలైన 16 రోజులకు అంటే 2026 ఆగస్టు 30 నాటికి ప్రపంచవ్యాప్తంగా ₹240 కోట్ల క్లబ్‌లోకి చేరింది. 2026 ఆగస్టు 14న విడుదలైన ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే ₹100 కోట్లు, మొదటి వారంలోనే ₹200 కోట్ల మార్కును దాటి సంచలనం సృష్టించగా, సూర్య కెరీర్‌లో ‘కరుప్పు’ తర్వాత ₹240 కోట్ల మార్కును సాధించిన మరో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

సాధారణంగా ఒక సినిమా రెండో వారంలోకి అడుగుపెట్టిన తర్వాత కొత్త సినిమాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ‘విశ్వనాథ్ & సన్స్’ మాత్రం థియేట్రికల్ రన్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వచ్చిన స్పందనతోనే ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ మూవీని నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఇందులో సూర్య నటనతో పాటు మమితా బైజు పెర్ఫార్మెన్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ ప్రేక్షకులు సినిమాను ఆదరించడం వల్లే రెండో వారంలో కూడా వసూళ్లు నిలకడగా కొనసాగుతున్నాయని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సినిమా రూ.240 కోట్ల వసూళ్లతో 15 రోజుల తర్వాత కూడా ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడం ఈ సినిమాను ప్రేక్షకులు ఏపాటిగా ఆదరిస్తున్నారో తెలుస్తోంది. మొత్తంగా చూస్తే ‘విశ్వనాథ్ & సన్స్’ సూర్య కెరీర్‌లో మరో బాక్సాఫీస్ హిట్ చేరింది. ‘కరుప్పు’ సినిమాతో 300కోట్ల క్లబ్ లో చేరారు సూర్య. విడుదలై 15 రోజులు పూర్తయిన తర్వాత కూడా కొత్త చిత్రాల పోటీని తట్టుకుని రూ.240 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ‘విశ్వనాథ్ & సన్స్’ కూడా ఆ రికార్డుని బ్రేక్ చేస్తుందా ? దారిదాపుల్లో నిలుస్తుందా ? అనేది ఈ వారాంతంలో తేలనుంది.