Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక గత కొన్నిరోజుల క్రితం సూర్య, డైరెక్టర్ బాలా కాంబోలో అచలుడు అనే సినిమా ప్రకటించిన విషయం కూడా విదితమే. నంద సినిమాతో సూర్యను మాస్ హీరోగా నిలబెట్టింది డైరెక్టర్ బాలనే. ఇక శివపుత్రుడులో సూర్యకు ఒక స్పెషల్ రోల్ ను డిజైన్ చేసి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇక ఈ కాంబో మళ్లీ ఎప్పుడు రీపీట్ అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు.ఎట్టకేలకు చాలా ఏళ్ళ తరువాత ఈ కాంబో సెట్ అయ్యింది. సూర్య 41 గా ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడం, కొద్దిగా షూటింగ్ కూడా జరుపుకొంది. అయితే మధ్యలో సూర్య ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. అదంతా నిజం కాదని, కొన్ని కారణాల వలన షూటింగ్ వాయిదా పడింది కానీ సినిమా క్యాన్సిల్ అవ్వలేదని సూర్య చెప్పుకురావడంతో అచలుడు ఇప్పుడు కాకపోయినా కొన్ని రోజుల తరువాత అయినా షూటింగ్ మొదలుపెడుతుంది అనుకున్నారు. కానీ, ఈ సినిమా మొత్తానికే క్యాన్సిల్ అయ్యినట్లు బాలా అధికారికంగా ప్రకటించాడు.
” నేను నా తమ్ముడు సూర్యతో అచలుడు సినిమా తీయాలనుకున్నాను. కానీ, కథలో కొన్ని మార్పులు చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ తన స్టార్ డమ్ కి సరిపోతుందో లేదో నాకు కచ్చితంగా తెలియద. నా తమ్ముడు నన్ను నమ్ముతాడు. కానీ, నేనే గమ్మతైన పరిస్థితిలో పడ్డాను. అందుకే నేను, సూర్య కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం. ఈ సినిమా నుంచి సూర్య తప్పుకున్నాడు. నిజానికి అతడికి ఇది చాలా కష్టమైన పని.. కానీ తప్పలేదు. మరోసారి మా కాంబో మిమ్మల్ని అలరిస్తుందని హామీ ఇస్తున్నాను” అని చెప్పుకొచ్చాడు. దీంతో సూర్య ఫ్యాన్స్ కొద్దిగా నిరాశ చెందుతున్నారు.
Herewith we share the official note from the Desk of Director #Bala @IyakkunarBala @rajsekarpandian @2D_ENTPVTLTD#DirBala #வணங்கான் #Vanangaan pic.twitter.com/hXKsHHfD08
— Done Channel (@DoneChannel1) December 4, 2022
