Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ లోనే కాదు తెలుగులో కూడా సూర్యకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అందరికీ తెలిసిందే. ఈ ఏడాది సూర్య పుట్టినరోజును తెలుగు అభిమానులు ఎంత గ్రాండ్ గా చేశారో అందరం చూసాం. ఫ్లెక్సీలు కడుతూ ఇద్దరు అభిమానులు మృతి చెందిన విషయం కూడా విదితమే. ఆ ఇద్దరు యువకుల కుటుంబాలకు ఏ సహాయం కావాలన్నా తానే దగ్గర ఉండి చూసుకుంటానని సూర్య తెలిపాడు. ఈ ఒక్క సంఘటన చాలు.. తెలుగువారికి సూర్య అంటే ఎంత ప్రేమనో తెలుపడానికి.. ప్రస్తుతం సూర్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికి కంగువా సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్న సూర్య మరోపక్క వాడీ వసూల్ తో పాటు ఇంకో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాజాగా సూర్య ఫ్యాన్స్ మీట్ లో తన తదుపరి సినిమాలను అధికారికంగా ప్రకటించాడు. అందులో ఒకటి రోలెక్స్ అని కన్ఫర్మ్ చేశాడు.
Vadivelu: కమెడియన్ వడివేలు అలాంటివాడా.. ఆమెకు ఆఫర్స్ రాకుండా చేసి.. సెట్ లో అలా అడిగి
విక్రమ్ సినిమాలో రోలెక్స్ పాత్రలో సూర్య కనిపించిన విషయం తెలిసిందే. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే సూర్య క్లైమాక్స్ మరో ఎత్తు. అప్పటినుంచి రోలెక్స్ టైటిల్ తో లోకేష్ కనగరాజ్ ఒక సినిమా తీస్తే బాగుంటుందని అభిమానులు కోరుతూనే ఉన్నారు. దీంతో సూర్య- లోకేష్ అభిమానుల కోరిక మేరకు రోలెక్స్ ను తెరమీదకి తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని సూర్య ఫాన్స్ మీట్ లో తెలిపాడు. ఇవన్నీ పక్కన పెడితే సూర్య లేటెస్ట్ పిక్ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. క్లాస్ లుక్ లో సూర్య ఎంతో అందంగా కనిపించాడు. వైట్ అండ్ ఎల్లో కలర్ హాఫ్ షర్ట్, గుబురు గడ్డం, చేతికి వాచ్ తో చాలా సింపుల్ అవుట్ ఫిట్ తో, కూల్ గా నవ్వుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. క్లాస్ లుక్ లో సూర్యను చూసిన అభిమానులు ఏమున్నాడు రా బాబు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ లుక్ లో గనక ఒక లవ్ స్టోరీ పడితే హిట్టు కన్ఫామ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి సూర్య కంగువతో ఎలాంటి హిట్ ను అందుకుంటాడో లేదో చూడాలి.