NTV Telugu Site icon

Suriya: కంగువ సెకండ్ లుక్ రిలీజ్… పీరియాడిక్ కాదు సెమీ పీరియాడిక్

Suriya

Suriya

ప్రైడ్ ఆఫ్ కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీగా… తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న బాహుబలి సినిమాగా పేరు తెచ్చుకుంది ‘కంగువ’ సినిమా. సౌత్ లో స్టార్ హీరో ఇమేజ్ ఉన్న సూర్య నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని శివ డైరెక్ట్ చేస్తున్నాడు.  ఈ మూవీ అనౌన్స్మెంట్ నుంచే సాలిడ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఇక గ్లింప్స్ తో కంగువ సినిమా ట్రెమండస్ రెస్పాన్స్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. టెక్నీకల్ గా సాలిడ్ గా ఉండడం, సూర్య లుక్ నెవర్ బిఫోర్ గా ఉండడంతో కంగువ గ్లింప్స్ అంచనాలని పెంచేసింది. తమిళ్, తెలుగు అనే తేడా లేకుండా ఆల్ ఇండియన్ లాంగ్వేజస్ లో కంగువ సినిమా రిలీజ్ కానుంది. ఇందుకు తగ్గట్లుగానే గ్లింప్స్ తో అన్ని లాంగ్వేజస్ లో ప్రమోషన్స్ చేసారు. దీంతో కంగువా సినిమా కోలీవుడ్ ఖాతాలో మొదటి వెయ్యి కోట్ల సినిమా అవుతుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నారు. అయితే లేటెస్ట్ గా కంగువ సెకండ్ లుక్ ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసారు మేకర్స్.

ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది… కంగువ సినిమాని పీరియాడిక్ డ్రామా అనుకున్న వాళ్లకి ఊహించని షాక్ ఇస్తూ లేటెస్ట్ పోస్టర్ సూర్య న్యూ ఏజ్ లుక్ లో అల్ట్రా మోడరన్ గా ఉన్నాడు. కంగువా సినిమా మొత్తం ఈ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లోనే ఉండదని… మొదటి నుంచి వినిపిస్తున్న మాటని నిజం చేస్తూ ఈ కొత్త పోస్టర్… కంగువ సెమీ పీరియాడిక్ అని తేల్చేసింది. పీరియాడిక్ వార్ బ్యాక్ డ్రాప్ తో పాటు మిగిలిన కథ గోవాలో జరుగుతుందట. ఈ విషయాన్ని మేకర్స్ చివరి వరకూ దాచి ఉంటె కంగువ సినిమాకి పెద్ద దెబ్బ పడేది కానీ మేకర్స్ సెకండ్ లుక్ పోస్టర్ కే ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేయడంతో కంగువ సినిమా సెమీ పీరియాడిక్ అనే మూడ్ సెట్ అయ్యింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్న ఈ సినిమాని తెలుగులో యువీ క్రియేషన్స్ రిలీజ్ చేస్తున్నారు.

Show comments