NTV Telugu Site icon

Diya Suriya: సూర్య- జ్యోతిక కూతురు బిగ్గెస్ట్ అచీవ్ మెంట్.. మ్యాథ్స్‌లో 100/100

Diya Suriya

Diya Suriya

కోలీవుడ్ అడోరబుల్ కపుల్ సూర్య- జ్యోతిక గురించి ఎవరికి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అన్యోన్యమైన భార్యాభర్తలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న జంటల్లో వీరు ఒకరు. హీరోయిన్‌ గా కెరీర్‌ పీక్స్‌లో ఉన్నపుడే సూర్యను పెళ్లి చేసుకుని జ్యోతిక సినిమాలకు గుడ్‌బై చెప్పిన జ్యోతిక తమ పిల్లలు దియా, దేవ్ ఆలనాపాలనా చూసుకొంటూ గృహిణిగా మారిపోయింది. ఇక సూర్యకు తన పిల్లలు అంటే ఎనలేని ప్రేమ.. ముఖ్యంగా దియాతో సూర్యకు అనుభందం మాటల్లో వర్ణించలేనిది. కొంచెం సమయం దొరికినా సూర్య కూతురు, కొడుకుతో కలిసి చిన్నపిల్లాడు అయిపోతాడు.

ప్రస్తుతం దియా చెన్నైలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 10 వ తరగతి పూర్తి చేసింది. ఇక తాజాగా ఆమె పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. చిన్నతనం నుంచి దియా చదువుల్లో దిట్ట. మొదటి నుంచి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయిన ఆమె 10 వ తరగతి పరీక్షల్లోనూ తన ప్రతిభను చూపించింది. అన్ని సబ్జెక్టుల్లోనూ 95 ప్లస్‌ మార్కులు సాధించి ఆశ్చర్యపరిచింది. మరి ముఖ్యంగా అతి కష్టమైన మాథ్స్ సబ్జెక్టులో 100 కి 100 స్కోర్ చేసింది. ఇది ఒక బిగ్గెస్ట్ అచీవ్ మెంట్ అని చెప్పొచ్చు. 10 వ తరగతి మ్యాథమేటిక్స్‌ అంటే ఎంత కష్టంగా ఉంటాయో అందరికి తెలిసిందే. అందులో కనీసం పాస్ మార్కులు వస్తే చాలు అనుకొనేవారు చాలామంది ఉన్నారు. అలాంటిది ఆ సబ్జెక్టులో నూటికి నూరుశాతం మార్కులు సాధించింది అంటే దియా ఎంత కష్టపడిందో అర్ధం అవుతుంది.

ఇక కూతురు సాధించిన బిగ్గెస్ట్ అచీవ్ మెంట్ కు సూర్య పొంగిపోతున్నారు. అంతే కాదు వారి కుటుంబం మొత్తం సంబరాలు చేసుకుంటోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సైతం సూర్య దంపతులకు, దియాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే దియా ప్రతిభను చూస్తుంటే ముందు ముందు చదువుల్లో బాగా రాణిస్తుందని తెలుస్తోంది. అయితే పెద్దయ్యాక ఆమె సినీ ఇండస్ట్రీకి వచ్చే అవకాశం లేదని కొందరు అంటున్నారు. తల్లిదండ్రుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని దియా హీరోయిన్ గా ఎదుగుతుందా..? లేక తన ప్రతిభకు తగ్గ రంగంలో ఎదుగుతుందా అనేది చూడాలి.

Show comments