Suriya-Jyothika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ జంటగా వస్తారా?.. వైరల్ అవుతున్న సూర్య, జ్యోతిక ఫోటోషూట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suriya-Jyothika: చాలా కాలంగా అభిమానులు ఎదురుచూస్తున్న విజయం ఎట్టకేలకు సూర్యను చేరుకుంది. వరుస సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఆయన కెరీర్‌పై ఎన్నో చర్చలు జరిగినప్పటికీ, రీసెంట్ గా విడుదలైన ‘కరుప్పు’ ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసిన ఈ మూవీ సూర్యకు కొత్త జోష్ ను తీసుకొచ్చింది. అదే జోష్ తో ముందుకు వెళ్తున్నట్లే కనిపిస్తుంది సూర్య. రీసెంట్ గా భార్య జ్యోతికతో కలిసి చేసిన తాజా ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. దీంతో ఈ జంటను మళ్లీ వెండితెరపై చూడాలని అభిమానులు కూడా ఆశిస్తున్నారు. ‘కరుప్పు’ విజయం తర్వాత సూర్య ప్రస్తుతం తన తదుపరి మూవీ ‘విశ్వనాథ్ & సన్స్’ విడుదల కోసం సిద్ధమవుతున్నారు. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు కూడా ఉన్నాయి. ‘కరుప్పు’తో వచ్చిన హిట్ ను కొనసాగిస్తూ మరో హిట్ అందుకోవాలనే లక్ష్యంతో సూర్య ఈ మూవీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. ఒకవైపు కెరీర్లో విజయాల పరంపరను కొనసాగించాలని చూస్తున్న ఆయన, మరోవైపు అభిమానులతో కూడా మంచి కమ్యూనికేషన్ ఏర్పరచుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ కోసం సూర్య, జ్యోతిక కలిసి చేసిన ఫోటోషూట్ ప్రత్యేకంగా నిలిచింది. మోనోక్రోమ్, సెపియా టోన్లలో రూపొందించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. ఐవరీ, బేజ్ రంగుల దుస్తుల్లో కనిపించిన ఈ జంట ఎంతో హుందాగా కనిపించడమే కాకుండా, వారి మధ్య ఉన్న అనుబంధాన్ని కూడా ఆ ఫోటోలు అందంగా ప్రతిబింబించాయి. తెరపై ఎంత అందంగా కనిపిస్తారో, రియల్ లైఫ్ లో కూడా అంతే ఆప్యాయతతో కనిపిస్తున్నారంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. సూర్య, జ్యోతిక తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన జంటల్లో ఒకరు. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించిన వీరిద్దరూ 2006లో విడుదలైన ‘సిల్లును ఒరు కాదల్’ తర్వాత మళ్లీ ఏ సినిమాలోనూ కలిసి కనిపించలేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా వీరి కాంబినేషన్ కోసం అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు ఇద్దరూ కలిసి కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నట్లు ఎలాంటి ఆఫీషియల్ అనౌన్స్ చేయనప్పటికి, ఏదో ఒక సందర్భంలో ఈ ప్రశ్న మళ్లీ వినిపిస్తూనే ఉంటుంది.
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
ఈ తాజా ఫోటోషూట్ కూడా అదే చర్చకు మరింత ఊతమిచ్చింది. సోషల్ మీడియాలో అనేక మంది అభిమానులు ఈ జంట మళ్లీ ఒక మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుంటున్నారు. వారి కెమిస్ట్రీ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదని, సరైన కథ దొరికితే మరోసారి వెండితెరపై మ్యాజిక్ సృష్టించగలరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సూర్య కెరీర్ పరంగా కూడా అత్యంత కీలక దశలో ఉన్నారు. కరప్పు తో బ్లాక్ బస్టర్, ఇప్పుడ ‘విశ్వనాథ్ & సన్స్’ తో మరో హిట్ వేసుకున్నా, అదే సమయంలో జ్యోతికతో సినిమా చేస్తే ఆయన కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉంది. ఆయన మరోసారి జ్యోతికతో కలిసి నటించే రోజు కోసం అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!