Site icon NTV Telugu

Suriya : ‘విక్రమ్’ తరువాత రోలెక్స్ సార్ ఎక్కడున్నారో తెలుసా..?

Suriya Jyothika

Suriya Jyothika

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇటీవల విక్రమ్ సినిమాలో కనిపించి మెప్పించిన విషయం విదితమే. కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకొంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో సూర్య.. రోలెక్స్ పాత్రలో కనిపించి సినిమాకు ప్రాణం పోశాడు. విక్రమ్ విడుదలైన దగ్గరనుంచి సూర్యను రోలెక్స్ సార్ అంటూ పిలిచేస్తున్నారు అభిమానులు. ఇక ఈ సినిమాలో పారితోషికం తీసుకోకుండా నటించినందుకు కమల్, సూర్యకు రోలెక్స్ వాచ్ ను గిఫ్ట్ గా ఇచ్చిన విషయం విదితమే. ఇకపోతే ప్రస్తుతం సూర్య కుటుంబంతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు.

ఇటీవలే సూర్య కూతురు దియా 10 వ తరగతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన విషయం కూడా తెల్సిందే.. దీంతో ఆ సక్సెస్ ను కూడా వెకేషన్ లోనే ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను జ్యోతిక సోషల్ మీడియా పోస్ట్ చేసింది. ఈ వీడియో లో జ్యోతిక, సూర్య ఎంతో అందంగా కనిపించారు. ఇక ఆ వీడియోను దియా ఎడిట్ చేసినట్లు జ్యోతిక చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం సూర్య- బాలా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. కొన్ని కారణాల వలన గ్యాప్ తీసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

Exit mobile version