కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జై భీమ్’ సినిమా ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. కానీ ఆ సినిమా ఓటీటీలో రిలీజ్ అవడంతో ఫ్యాన్స్ కాస్త డిసప్పోఇంట్ అయ్యారు. ఒక బలమైన సామాజిక కథాంశంతో వచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ క్రేజీ కాంబో.. ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడానికి సిద్ధమైంది. సూర్య కెరీర్‌లో 48వ ప్రాజెక్ట్‌గా రాబోతున్న చిత్రానికి టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వం వహించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సూర్య సరికొత్త నిర్మాణ సంస్థ ‘అగరం స్టూడియోస్’ నిర్మించబోతోంది.
ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఒక యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ అని సమాచారం. పేద ప్రజలకు కేవలం 5 రూపాయలకే వైద్యం అందించన ప్రముఖ సామాజిక సేవకుడు, దివంగత వైద్యుడు ‘తిరువేంగడం వీరరాఘవన్’ జీవిత కథ ఆధారంగా ఈ బయోపిక్ రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రంలో సూర్య ఒక పవర్‌ఫుల్ డాక్టర్ పాత్రలో కనిపించనునున్నాడు. ‘జై భీమ్’లో లాయర్ చంద్రుగా మెప్పించిన సూర్య ఇప్పుడు డాక్టర్ వీరరాఘవన్ పాత్రలో చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సూర్య కెరీర్ లోనే టాప్ ఫామ్‌లో దూసుకుపోతున్నారు. ఇటీవల సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వచ్చిన ‘కరుప్పు’ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా సూర్య కెరీర్‌లోనే సరికొత్త కలెక్షన్ల రికార్డులను సృష్టించింది. ఈ గ్రాండ్ సక్సెస్ జోష్‌లో ఉన్న సూర్య, తన లైనప్‌లో ఉన్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాతో పాటు జిత్తు మాధవన్ చిత్రాలను పూర్తి చేసిన వెంటనే ఈ ఏడాది సెప్టెంబర్ నుండి ‘అగరం స్టూడియోస్’ బ్యానర్‌లో జ్ఞానవేల్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నారు.
