NTV Telugu Site icon

Suriya 44: సూర్య సినిమా నటించాలని ఉందా?.. ఇలా చేయండి!

Suriyaaa

Suriyaaa

Suriya 44 Casting Call:’పెట్టా’ సక్సెస్‌ తర్వాత కార్తీక్‌ సుబ్బరాజ్‌, నటుడు సూర్యతో కొత్త సినిమా మొదలు పెట్టనున్నారు. ఆ సినిమాకి కార్తీక్ దర్శకత్వం వహించబోతున్నారు. ఇది సూర్యకి 44వ సినిమా కావడం గమనార్హం. పీరియాడిక్ స్టోరీగా గ్యాంగ్‌స్టర్, లవ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సూర్య ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. జూన్ 17న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా, తిరునావుకరసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 24, పేట చిత్రాలకు తిరునావుక్కరసు సినిమాటోగ్రఫీ చేయడం గమనార్హం.

ఇండియాలో ఓటు హక్కు లేని హీరోయిన్లు వీరే

ప్రస్తుతం సూర్య కంగువ సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత కార్తీక్ సినిమాలో నటించనున్నాడు. వరుసగా భారీ చిత్రాలను లైన్ లో పెట్టడంతో సూర్య అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సందర్భంలో, కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రానికి సంబంధించిన కాస్టింగ్ కాల్ పోస్టర్‌ను తన ఎక్స్ పేజీలో విడుదల చేశారు. భాషాభేదం లేదని, ఆడ, మగ అనే తేడా లేదని ఆ క్యాస్టింగ్ కాల్ లో పేర్కొన్నారు. ఇక ఈ సినిమాలో నటించాలనుకునే వారు తమ పేరు, ఇతర వివరాలను పేర్కొంటూ 1 నుంచి 3 నిమిషాల నిడివి గల వీడియోను 7550011050కు పంపాలని పోస్టర్‌లో పేర్కొన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం నటించాలని ఆసక్తి ఉన్నవారు ప్రయత్నం చేసేయండి మరి.

Show comments