Site icon NTV Telugu

Suriya 42: మైటీ వారియర్ వస్తున్నాడు…

Suriya 42

Suriya 42

బాహుబలి, ఆర్ ఆర్ ఆర్, KGF, కాంతార సినిమాలు సౌత్ ఇండియా నుంచి రిలీజ్ అయ్యి పాన్ ఇండియా రేంజులో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. తమిళనాడు నుంచి పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమా పాన్ ఇండియా హిట్ అవుతుంది అనుకుంటే ఆ సినిమా 500 కోట్లు రాబట్టినా అది తమిళనాడుకి మాత్రమే పరిమితం అయ్యింది. కమర్షియల్ సినిమాని, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాని పర్ఫెక్ట్ గా బాలన్స్ చేసే కోలీవుడ్ నుంచి పాన్ ఇండియా హిట్ అయ్యే సినిమా వస్తుందా రాదా అనే ప్రశ్నకి సమాధానమే ‘సూర్య 42’. మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ ఆఫ్ దిస్ జనరేషన్ గా పేరు తెచ్చుకున్న సూర్య నటిస్తున్న ఈ మూవీపై కోలీవుడ్ వర్గాల్లో భారి అంచనాలు ఉన్నాయి. సిరుత్తే శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పీరియాడిక్ డ్రామాగా రూపొందుతుంది. దాదాపు పది భాషల్లో, 2D అండ్ 3D ఫార్మాట్స్ లో ‘సూర్య 42’ విడుదల కానుంది. ఈ మూవీలోని ఒక భారి యాక్షన్ ఎపిసోడ్ ని ఇటివలే శ్రీలంక అడవుల్లో కంప్లీట్ చేశాడు దర్శకుడు శివ. బాలీవుడ్ బ్యూటీ దిశా పఠాని హీరోయిన్ గా నటిస్తున్న ‘సూర్య 42’ సినిమా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ని ఏప్రిల్ 16న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. వీరుడు వస్తున్నాడు అంటు బయటకి వచ్చిన ఈ అనౌన్స్మెంట్ సూర్య ఫాన్స్ లో జోష్ నింపింది.

ఇదిలా ఉంటే రీసెంట్ గా ‘తళ్లుమాల’ సినిమాకి ఎడిటర్ గా మంచి పేరు తెచ్చుకున్న నిషాద్ యూసఫ్, ‘సూర్య 42’ గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… “ఈ మూవీ సెవెంత్ సెన్స్ ని మించి ఉంటుంది” అంటూ చెప్పాడు. ‘సూర్య 42’ గురించి ఈ మాటలు విన్న సూర్య ఫాన్స్ ఈ ఇంటర్వ్యూని వైరల్ చేస్తున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘సూర్య 42’ సినిమాని తెలుగులో యువీ క్రియేషన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ప్రీలుక్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సూర్య 42 సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసమే సూర్య, వెట్రిమారన్ చేస్తున్న సినిమాని వాయిదా వేస్తూ వస్తున్నాడు. ‘వాడివాసిల్’ పేరుతో సూర్య, వెట్రిమారన్ కాంబినేషన్ లో ఒక సినిమా అనౌన్స్ అయ్యింది. సూర్య 42 ప్రాజెక్ట్ డిలే అవుతూ ఉండడంతో, ‘వాడివాసిల్’ క్యాన్సిల్ అవుతుందేమో అనే రూమర్స్ కోలీవుడ్ లో వినిపిస్తున్నాయి.

Exit mobile version