నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ తాండవం’ విడుదల ఆఖరి నిమిషంలో వాయిదా పడటం అభిమానులను నిరాశకు గురిచేసింది. ఫైనాన్స్ ఇష్యూస్ కారణంగా ఈ సినిమా రిలీజ్ నిలిచిపోయిందని వార్తలు వచ్చాయి. దీంతో అసలు సినిమా ఎప్పుడు విడుదలవుతుందో కూడా తెలియని అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో, ప్రముఖ నిర్మాత, సినీ డిస్ట్రిబ్యూటర్ సురేష్ బాబు తాజాగా ఈ అంశంపై స్పందించారు. నిజానికి ‘అఖండ తాండవం’ సినిమాకు నిర్మాతగా సురేష్ బాబుకు ఎలాంటి సంబంధం లేకపోయినా, ఆయన డిస్ట్రిబ్యూటర్‌గా కొన్ని ప్రాంతాల్లో సినిమాను విడుదల చేస్తున్నారు. అలాగే, సినిమా రిలీజ్‌కు అడ్డుపడిన EROS ఇంటర్నేషనల్ సంస్థతో ఆయనకు అనుబంధం ఉంది. తాజాగా, ‘సైక్ సిద్ధార్థ’ అనే సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్‌కు హాజరైన సురేష్ బాబుకు ‘అఖండ తాండవం’ వాయిదా గురించి ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆయన స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.
Also Read :Akhanda2 Thaandavam : 14 రిల్స్ కు తీర్పు అనుకూలంగా వచ్చిన రిలీజ్ కష్టమే
సురేష్ బాబు ఈ సందర్భంగా మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చపై అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఈ సమస్య క్లియర్ అవుతుంది. ఇవన్నీ కేవలం ఫైనాన్షియల్ మేటర్స్. వాటిని ఓపెన్‌గా బయట డిస్కస్ చేయకూడదు.” “దురదృష్టవశాత్తు, ఈ బిజినెస్ గురించి ఎక్కువగా సోషల్ మీడియాలో డిస్కస్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ సమస్యలో అంతా ఇంత డబ్బులు ఇన్వాల్వ్ అయ్యాయట అని మాట్లాడుకుంటున్నారు. అవన్నీ ఎందుకు? జనాలు సినిమా చూస్తే చాలు కదా!”. సినిమా రంగంలో ఫైనాన్షియల్ ఇబ్బందులు సర్వసాధారణమని సురేష్ బాబు స్పష్టం చేశారు. “ప్రతి సినిమాకి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. మా ల్యాబ్‌లు ఉన్నప్పుడు కూడా ఈ సమస్యలు ఉండేవి, ఇప్పుడు వస్తున్న సినిమాలకు కూడా ఉంటాయి.”
Also Read :Pushpa 2: జపాన్‌లో ‘పుష్ప 2’.. అక్కడికే ఎందుకు?
అయితే, ముందుగా సరైన ప్రణాళికతో ఉంటే ఈ సమస్యలు తలెత్తేవి కాదనే అభిప్రాయాన్ని ఆయన పరోక్షంగా వ్యక్తం చేశారు. “ముందుగా ప్లాన్ చేసుకొని ఉంటే, ఈపాటికి ఇబ్బందులు లేకుండా క్లియర్ అయ్యి రిలీజ్ చేసి ఉండేవాళ్లు. ఈరోజు (త్వరలో) సినిమా రిలీజ్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం” అంటూ సురేష్ బాబు పేర్కొన్నారు. సురేష్ బాబు వ్యాఖ్యలను బట్టి చూస్తే, ‘అఖండ తాండవం’ ఫైనాన్స్ ఇష్యూస్ త్వరలోనే పరిష్కారమై, సినిమా విడుదల త్వరలో ప్రకటించవచ్చని మెగా అభిమానులు ఆశిస్తున్నారు.