Surekha Vani: నా మొగుడు ఉన్నా కూడా నేను ఇలానే చేసేదాన్ని.. సురేఖావాణి సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Surekha Vani: టాలీవుడ్ ఇండస్ట్రీలో సురేఖా వాణి గురించి కానీ, ఆమె కూతురు సుప్రీత గురించి కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి అయితే అస్సలు చెప్పనవసరం లేదు. సినిమాల్లో ఎంత పద్దతిగా సురేఖ కనిపిస్తుందో.. రియల్ గా దానికి రివర్స్ లో పక్కా ఫ్యాషన్ బుల్ గా ఉంటుంది. ఇక కూతురుతో పబ్ లు, పార్టీలు, మందు, చిందులు.. ఒకటిని కాదు. ఇక ఇవి కాకుండా రీల్స్, ఇంటర్వ్యూలో ఘాటు ఘాటు సమాధానాలు.. ఇవన్నీ చూస్తున్న నెటిజన్స్ వారిని విమర్శిస్తున్నారు. అంతేకాకుండా భర్త పోయాకా విచ్చలవిడి తనం ఎక్కువ అయ్యిందని, సోషల్ మీడియాలో రీల్స్ చేసిన వీడియోల కింద అసభ్యకరమైన కామెంట్స్ పెడుతూ వస్తున్నారు. ఇక ఈ మధ్య ఆమె గుండు చేయించుకోవడం కూడా హాట్ టాపిక్ గా మారింది.
ఇక తాజాగా ఈ కామెంట్స్ అన్నింటికి సురేఖా వాణి సమాధానం చెప్పుకొచ్చింది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ గురించి మాట్లాడుతూ.. ” నా పెళ్ళైన కొత్తలో నేను గుండు చేయించుకున్నాను.. మళ్లీ 20 ఏళ్ళ తరువాత గుండు చేయించుకున్నాను. ఏమో లైఫ్ అంతా ఏదోలా అనిపించింది. అసలు ఏంటి ఇది.. ? అనిపించింది. మేమెప్పుడూ తిరుపతి, శ్రీశైలం వెళ్తూ ఉంటాం. మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు.. దేవుడా నాకు ప్రశాంతమైన లైఫ్ ఇవ్వు.. ఇంకేం వద్దు అని మొక్కుకొని గుండు చేయించుకున్నాను.. అంతే. అప్పుడు అంటే మీడియా ఎక్కువ లేదు కాబట్టి తెలియలేదు. ఇప్పుడు మీడియా ఫీల్డ్ లో ఉండి ఎలా అని అడుగుతున్నారు” అని చెప్పుకొచ్చింది.
Also Read
- Salman Khan: ఒక బాత్రూమ్కు 70 మంది.. జైల్లో గడిపిన రోజులు గుర్తు చేసుకున్న సల్మాన్ ఖాన్..
- Vaddi Kasula Vaadu: మంచు మనోజ్ 'వడ్డీ కాసుల వాడ'లో అదిరే సర్ప్రైజ్... వెంకటేశ్వర స్వామిగా జయం రవి
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
ఇక ఈ వివాదాలు అన్ని జరగడానికి నేను కూడా కారణం అని మీకెప్పుడైనా అనిపించిందా.. ? అన్న ప్రశ్నకు.. ” నేనెప్పుడూ అలా అనుకోలేదు. నా ప్రమేయం లేకుండా చాలా జరిగాయి. నేను ఏది కావాలని చేసింది లేదు. కాంట్రవర్సీలు ఎక్కడ వస్తున్నాయి. నా కూతురుతో కలిసి బయటికి వెళ్ళినప్పుడో.. ఫోటోలు పెట్టినప్పుడో వస్తున్నాయి. వీటి కోసం మాట్లాడుతున్నారు. అందుకే మాట్లాడుకోనివ్వమని అంటున్నాను. ఇది నేను.. ఇది నా లైఫ్.. నేను ఇలాగే ఉంటాను. ఇక వీటికి ఇంకొంచెం యాడ్ చేసి ఏం అంటున్నారు అంటే.. మొగుడు పోయాక విచ్చలవిడితనం అని. నేను నా 19 ఏళ్లకు పెళ్లి చేసుకున్నాను. 20-25 ఏళ్లకే 45 ఏళ్లలా అన్ని చూసుకున్నాను. ఇప్పుడు నాకు 42. ఇప్పుడు నేను 20 ఏళ్లలో ఉన్నట్లు ప్రవర్తిస్తున్నాను. నేను నా కూతురితో ఎంజాయ్ చేస్తున్నాను. ట్రిప్స్ కు వెళ్ళాలి. నా మొగుడు ఉన్నా కూడా ఇదే జరిగేదేమో..ఖచ్చితంగా ఇలానే ఉండేదాన్ని ఏమో. అప్పుడు నాకు ఎక్స్ పోజర్ లేదు. ఇప్పుడు నాకు అది ఉంది” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
Salman Khan: ఒక బాత్రూమ్కు 70 మంది.. జైల్లో గడిపిన రోజులు గుర్తు చేసుకున్న సల్మాన్ ఖాన్..
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు “బ్రాండెడ్ విషం” తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని అడ్డంకులే, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు!
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మాక్స్ రిలీజ్.. 10000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!