Surekha Vani: టాలీవుడ్ నటి సురేఖావాణి గురించి అందరికీ తెల్సిందే. సపోర్టివ్ రోల్స్ చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా మారింది. ఇక ఆమె సినిమాల కంటే కూడా.. సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా కూతురితో చిట్టిపొట్టి డ్రెస్ లు వేసుకొని రీల్స్ చేస్తూ కనిపించడం..యూట్యూబ్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ.. డబ్బున్న వాడు దొరికితే రెండో పెళ్లి చేసుకుంటాను అని చెప్పుకుంటూ.. వైరల్ గా మారింది. ఇక సురేఖనే ఓ రేంజ్ అనుకుంటే.. ఆమె కూతురు సుప్రీత వేరే లెవెల్ హాట్ బ్యూటీ. సోషల్ మీడియాలో నిత్యం హాట్ హాట్ ఫొటోస్ పెడుతూ ఇద్దరు తల్లీకూతుళ్లు హల్చల్ చేస్తూ ఉంటారు. ఇక ఈ మధ్యనే డ్రగ్స్ ఆరోపణలను కూడా ఎదుర్కున్న ఈ తల్లీకూతుళ్లు.. తాజాగా సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యారు.
Suriya: విజయకాంత్ ఆరోగ్యం.. సూర్య ట్వీట్ వైరల్
బీఆర్ ఎస్ పార్టీని గెలిపించడానికి చాలామంది ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీలు కారు ముందు రీల్స్ చేస్తూ కనిపించారు. అందులో ఈ తల్లీకూతుళ్లు కూడా ఉన్నారు. ముఖ్యంగా సుప్రీత కారు ముందు నిలబడి.. బీఆర్ ఎస్ ను గెలిపించమని కోరింది. ఇక నేడు కాంగ్రెస్ గెలవడంతో ఆ వీడియోను డిలీట్ చేసి.. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డితో ఉన్న ఫోటోను స్టోరీగా పెట్టి.. శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అదేంటి.. తల్లీకూతుళ్లు ఇద్దరు ప్లేట్ ఫిరాయించారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.