Site icon NTV Telugu

Supreme Power Stars: మామ… మన డ్రెస్ లు సూపర్ అంట.. బయట టాక్

Sai Dharam Tej Pspk

Sai Dharam Tej Pspk

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ల మధ్య ఉన్న రిలేషన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మెగా మామ అల్లుళ్ల కాంబినేషన్ కి మెగా ఫాన్స్ లో ఒక స్పెషల్ క్రేజ్ ఉంది. తేజ్ లైఫ్ ని మౌల్డ్ చేసి, చిన్నప్పటి నుంచి దగ్గర ఉండి చూసుకున్నాడు పవన్ కళ్యాణ్. మేనమామ అంటే అమితమైన ప్రేమ ఉన్న సాయి ధరమ్ తేజ్, ఇప్పుడు క్లౌడ్ నైన్ లో ఉన్నాడు. దీనికి కారణం తన ఐడల్ లాంటి పవన్ కళ్యాణ్ తో కలిసి నటించడమే. తమిళ్ లో హిట్ అయిన వినోదయ సీతం సినిమాని తెలుగులో సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ కలిసి రీమేక్ చేస్తున్నారు. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ రీమేక్ గురించి చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. ఇక రీమేక్ క్యాన్సిల్ అవుతుందేమో అనుకున్న సమయంలో… షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం అంటూ అఫీషియల్ అప్డేట్ ని ఇచ్చేసింది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ రీమేక్ గ్రాండ్ గా అనౌన్స్ అయ్యింది. ఈ అనౌన్స్మెంట్ సమయంలో రిలీజ్ చేసిన ఫోటోస్ లో పవన్ కళ్యాణ్-తేజ్ లు హుడీ వేసుకోని స్టైలిష్ గా కనిపించారు. మామ-అల్లుళ్లు కలిసి ఉన్న ఫోటో అయితే మెగా అభిమానులకి ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంది. పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్ గా ఉన్నాడు. ఈ అనౌన్స్మెంట్ ఫోటోస్ లో త్రివిక్రమ్, తమన్ కూడా ఉన్నారు. కథ ప్రకారం పవన్ కళ్యాణ్ ఈ రీమేక్ లో ‘టైం’గా నటిస్తుండగా… సాయి ధరమ్ తేజ్ ‘పరసురామ్’ అనే పాత్రలో నటిస్తున్నాడు. ఈ పాత్రలో తేజ్… చనిపోయిన తర్వాత తన తప్పులని తెలుసుకోని వాటిని సరిదిద్దుకోవడానికి ‘టైం’ దగ్గర మూడు నెలలు సమయం తీసుకోని, తిరిగి తన జీవితాన్ని ప్రారంభిస్తాడు. ఇక్కడి నుంచి తేజ్ తన తప్పులని ఎలా సరిదిద్దుకున్నాడు, చివరికి చనిపోయిన పరశురామ్ స్వర్గానికి ఎలా వెళ్లాడు అనేది కథ. మూల కథని మాత్రమే తీసుకోని కథనాన్ని మాత్రం తేజ్, పవన్ కళ్యాణ్ లకి సరిపోయేలా మార్పులు చేశారు. మరి అనౌన్స్మెంట్ తోనే మెగా అభిమానులని ఖుషీ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి నంబర్స్ ని రాబడుతుందో చూడాలి. ఇక ఈ ప్రాజెక్ట్ విషయమై తేజ్ ట్వీట్ చేస్తూ… “The Best Day” అని కోట్ చేశాడు. తన జీవితానికి గురువు లాంటి ప[పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం ఇచ్చినందుకు సముద్రఖనికి బిగ్ థాంక్స్ చెప్పాడు.

Exit mobile version