NTV Telugu Site icon

Supreetha: నేనేం అన్యాయం చేశా.. నన్నెందుకు వేధిస్తున్నారు.. సురేఖావాణి కూతురు పోస్ట్ వైరల్

Supree

Supree

Supreetha: టాలీవుడ్ నటి సురేఖావాణి, ఆమె కూతురు సుప్రీత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కూతురు సుప్రీతను హీరోయిన్ గా చేయడానికి సురేఖావాణి చాలా కష్టపడుతుంది. కొన్నేళ్ల క్రితమే సురేఖావాణి భర్తను కోల్పోయింది. ఇక అప్పటినుంచి ఈ తల్లీకూతుళ్లు సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్ గా మారారు. చిన్న చిన్న డ్రెస్ లు వేసుకొని కూతురుతో కలిసి సురేఖావాణి చేసే రీల్స్ ఎంతటి హంగామా సృష్టిస్తున్నాయో అందరూ చూస్తూనే ఉన్నారు. ఇక ఈ తల్లీకూతుళ్ల మీద ఉన్న వివాదాలు ఒకటి రెండు కాదు. కూతురు బర్త్ డే పార్టీలో తాగి చిందేసిన వీడియో దగ్గర నుంచి.. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కున్న ఘటన వరకు నెటిజన్స్ వీరిపై ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. ఇక నిన్నటికి నిన్న.. తెలంగాణ కాబోయే సీఎం రేవంత్ రెడ్డితో కలిసి దిగిన ఫోటోను తల్లీకూతుళ్లు షేర్ చేస్తూ కాంగ్రెస్ గెలిచినందుకు కంగ్రాట్స్ చెప్పారు. అయితే ఇదే తల్లీకూతుళ్లు కొన్నిరోజుల క్రితం బీఆర్ ఎస్ గెలవాలని కారు దగ్గర రీల్స్ చేస్తూ కనిపించారు. ఇక ఇప్పుడు ఆ వీడియో డిలీట్ చేసి ఈ ఫోటో పెట్టేసరికి మరోసారి ట్రోలర్స్ విరుచుకుపడ్డారు.

Eagle: ఆ లుక్ ఏంటి రవన్న.. మాస్ కే బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నావే

ఇక ఈ నేపథ్యంలోనే సుప్రీత ట్రోల్స్ పై స్పందించింది. ” ఈ పొలిటికల్ సిచ్యుయేషన్ మీద నన్ను చాలామంది ట్యాగ్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. నేను బీఆర్ ఎస్ కు సపోర్ట్ చేస్తాను. కానీ రేవంత్ రెడ్డి గారు గెలిచారని శుభాకాంక్షలు తెలిపాను. అనవసరంగా ట్రోల్ చేస్తున్నారు.. అంతేకాకుండా కావాలని కూడా ట్రోల్ చేస్తున్నారు. నేను మీకేం అన్యాయం చేశాను. నన్నెందుకు ఇలా వేధిస్తున్నారు. మీకు కొంచమైనా తెలుసా.. దీనివలన మా పర్సనల్ అండ్ మెంటల్ హెల్త్ ఎంత బాధపెడుతుందో” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Show comments