Supreetha: ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున్నా మేస్తుందా..? అనే సామెత గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం ఆ సామెతను నటి సురేఖవాణి ఆమె కూతురుకు వర్తిస్తుంది అని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. తల్లీకూతుళ్లు అన్నాకా ఫ్రెండ్స్ గా ఉండాలి.. కానీ, మరీ కూతురుతో మందు తాగించడం లాంటి చేయడం వలన వారి మధ్య ఉన్న బంధం గురించి విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి తెచ్చుకున్నారు. ఇక ఇదంతా పక్కన పెడితే.. ఈ తల్లీకూతుళ్లు ఇద్దరు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారా..? అంటే.. ఏమో తెలియదు అనే సమాధానం వినిపిస్తుంది. తాజాగా కేపీ చౌదరితో ఈ తల్లీకూతుళ్లు కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఒక పార్టీలో సురేఖా.. అతనికి ముద్దు పెడుతూ కనిపించింది. ఇక అతడు.. సురేఖకు మాత్రమే కాదు సుప్రీతకు కూడా తెలుసు అని తెలుస్తోంది.
Surekha Vani: డ్రగ్స్ కేసు.. కేపీ చౌదరితో సురేఖవాణి.. మరీ దారుణంగా ముద్దులు పెడుతూ
సుప్రీత కేపీ చౌదరిని దగ్గరగా పట్టుకొని ఉన్న ఫోటోలు కూడా నెట్టింట ప్రత్యేక్షమయ్యాయి. అయితే అతనితో వీరికున్న రిలేషన్ ఏంటి అనేది మిస్టరీగా మారింది. డ్రగ్స్ కేసు లో కేపీ చౌదరి అరెస్ట్ అయిన దగ్గరనుంచి టాలీవుడ్ మొత్తం గుప్పెట్లో గుండెను పట్టుకొని ఉంది. ఎవరి పేర్లు బయటికి వస్తాయా.. ? ఎవరు ఇరుక్కుంటారా..? అని ఆందోళనలో ఉంది. వీరి పేర్లు అయితే లిస్ట్ లో లేవు కానీ, అతడితో దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారడంతో వీరికి, అతనికి ఉన్న సంబంధం ఏంటి అనే దిశగా ఆరాలు తీస్తున్నారు. మరీ ఈ విషయమై ఈ తల్లీకూతుళ్లు ఎలా స్పందిస్తారో చూడాలి.