తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ గా కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మిశ్రమ స్పందన రాబట్టింది. కానీ భారీ హైప్ కారణంగా భారీ వసూళ్లు రాబట్టింది. తమిళనాడు మొదటి రోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం కూలీ థియేటర్స్ లో రన్ అవుతోంది. ఈ లోగా సూపర్ స్టార్ నెక్ట్స్ సినిమా ఏంటనే క్యూరియాసీటి నెలకొంది. ఇప్పటికే వెట్టయాన్ డైరెక్టర్ జ్ఞానవేల్, మారి సెల్వరాజ్, శివ, ఆదిక్ ఇలా పలువురు దర్శకులు రజనీకి కథలు చెప్పి ఉన్నారు.
Also Read : Power Star : నందమూరి బాలయ్య పై పవర్ స్టార్ సూపర్ ట్వీట్ ..
అయితే ఇటీవల కూలీ సినిమా డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో రజనీకాంత్, కమల్ హాసన్ కాంబోలో భారీ మల్టీస్టారర్ గా సినిమా రాబోతుందని తమిళ మీడియా నుండి వార్తలు వెలువడ్డాయి. కమల్ హాసన్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుందని కూడా అన్నారు. కానీ అఫీషియల్ గా ప్రకటన రాలేదు. ఇప్పుడు లేటెస్ట్ గా వీరందరూ కాదు అని మన తెలుగు డైరెక్టర్ పేరు గట్టిగా వినిపిస్తోంది. మహానటి, కల్కి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు డైరెక్ట్ చేసిన నాగ్ అశ్విన్ ఇటీవల రజినీని కలిసి ఓ కథ వినిపించగా అది రజనీకి బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమన్నట్టు చెన్నై సినీ వర్గాలలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అన్ని కుదిరితే వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ఒకవేళ ఓకే ఆయితే కల్కి 2898AD వాయిదా వేసే అవకాశం ఉంది.
