Rajinikanth : అభిమానుల ఆరాధ్య దైవం సూపర్ స్టార్ రజినీకాంత్ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి ఆయన చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో చేరారు. ఈ విషయం తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఆయన సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా దీనిపై క్లారిటీ ఇచ్చారు. రజినీకాంత్ తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నారని… దాంతో పాటు రెగ్యులర్ చెకప్ లో భాగంగానే ముందుగానే ప్లాన్ చేసుకున్న ఈ చెకప్ కోసమే హాస్పిటల్ లో చేరారు. గుండెకు సంబంధించిన పరీక్షలను మంగళవారం చేయాల్సి రావడంతో రజినీకాంత్ ఆసుపత్రిలో చేరారని తెలిపారు. అయితే అటు వైద్యుల నుంచి గానీ, ఇటు కుటుంబ సభ్యుల నుంచి గానీ అధికారిక ప్రకటన రాలేదు. మంగళవారం రజినీ కాంత్ కు ఎలక్టివ్ విధానాన్ని షెడ్యూల్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం రజినీ వయసు 73 సంవత్సరాలు.
Read Also:Harish Rao : సోషల్ మీడియా వేదికగా జరిగే ఇలాంటి వికృత చేష్టలను తీవ్రంగా ఖండిస్తున్నా
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపినట్లు, ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని రజినీకాంత్ సన్నిహితులు చెప్పారు. ఈ విషయం తెలిసి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ప్రస్తుతం రజినీకాంత్ వెట్టయాన్, కూలి సినిమాలతో బిజీగా ఉన్నారు. కొన్నిరోజులుగా వేట్టయాన్, కూలీ చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు రజినీ. వెట్టయాన్ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 10 న రిలీజ్ కాబోతుంది. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జై భీమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజినీకాంత్ నటిస్తున్న వేట్టయాన్ చిత్రం అక్టోబర్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతోపాటు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న కూలీ చిత్రంలో నటిస్తున్నాడు.
Read Also:Off The Record: Jethwani కేసులోకి మాజీ డీజీపీ పేరు?
Actor Rajinikanth hospitalised for severe stomach pain
Read @ANI Story | https://t.co/CswEROvTjW#Rajinikanth #hospitalisation #ApolloHospitals #Chennaipolice pic.twitter.com/T68pLy302G
— ANI Digital (@ani_digital) September 30, 2024