Site icon NTV Telugu

Sarkaru Vaari Paata: మ.. మ.. మహేష్ సాంగ్ లీక్..

Mahesh

Mahesh

ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా స్టార్ హీరోల సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. సెట్ లో ఫోన్లు బంద్ చేసినా కూడా ఎవరో ఒకరు ఎక్కడో ఒకచోట ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అవి కాస్తా వైరల్ కావడంతో అభిమానులు మేకర్స్ ఇచ్చే సర్ ప్రైజ్ లను మిస్స్ అవుతున్నారు. ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రం నుంచి లేటెస్ట్ సాంగ్ లీక్ కావడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. గీత గోవిందం దర్శకుడు పరుశరామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వేసవి కానుకగా మే 10 న రిలీజ్ అవుతున్న విషయం విదితమే. ఇక ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ఇప్పటికే ఏ చిత్రం నుంచి రిలీజైన రెండు పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇక ఈ సినిమా నుంచి మూడో పాటను ఏప్రిల్ 23 న మేకర్స్ రిలీజ్ చేస్తారని చెప్పడంతో ఫ్యాన్స్ అందరు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సాంగ్ కు సంబంధించిన పిక్స్, లిరిక్స్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి. మ.. మ.. మహేష్ అంటూ ఈ సాంగ్ మొదలు కానున్నదట. అఖండ లో యా.. యా.  జై బాలయ్య సాంగ్ తరహాలో ఈ సాంగ్ ని కంపోజ్ చేసాడట థమన్.. ఇక ఈ సాంగ్ లో మహేష్ ఊర మాస్ లుక్ లో కనిపించనున్నాడు. పూల పూల చొక్కా.. లుంగీ.. కళ్ళజోడుతో మాస్ స్టెప్పులు వేయబోతున్నాడట.. తాజాగా సూపర్ స్టార్ ఫుల్ ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ లీక్ లపై మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ లీకుల్లో నిజమెంత అనేది తెలియాలంటే ఏప్రిల్ 23 వరకు ఆగాల్సిందే.

Exit mobile version