NTV Telugu Site icon

Mahesh Babu: తుఫాన్… తుఫాన్ లా పరిగెడుతున్నాడు

Mahesh Babu

Mahesh Babu

సూపర్ స్టార్ మహేశ్ బాబు డీఏజింగ్ టెక్నిక్ ని కనుక్కున్నట్లు ఉన్నాడు, అసలు ఏజ్ కనిపించట్లేదు. వయసు పెరిగే కొద్దీ అందంగా కనిపిస్తున్నాడు. వయసు 50 ఏళ్ళకి దగ్గరవుతున్నా మహేశ్ మాత్రం ఇప్పటికీ పాతికేళ్ల కుర్రాడిలానే కనిపిస్తున్నాడు… అనే కామెంట్స్ మనకి తరచుగా వినిపిస్తూనే ఉంటాయి. ఏజ్ తో సంబంధం లేకుండా మహేష్ అంత అందంగా ఎలా ఉంటాడు అనే డౌట్ కూడా అందరిలో ఉంటుంది, ఈ డౌట్ కి ఇప్పుడు ఆన్సర్ దొరికేసింది. తన ఇన్స్టా లో మహేష్ బాబు వర్కౌట్స్ చేస్తున్న వీడియోలు పోస్ట్ చేసాడు. ఈ వీడియోస్ చూస్తే సితార, గౌతమ్ లకి కూడా మహేష్ బాబు అన్న అయి ఉంటాడు అనుకోవడంలో తప్పు లేదులే అనిపించకమానదు. మెరుపు వేగంతో పరిగెడుతున్నాడు, ఇంటెన్స్ వర్కౌట్స్ చేస్తున్నాడు, ఎంత కష్టపడాలో అంతా కష్టపడుతున్నాడు. హీరో అంత ఫిట్ అండ్ యంగ్ గా కనిపించడం వెనుక ఇంత కష్టం ఉంటుంది అని తెలియజేస్తూ మహేష్ జిమ్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి.

“My Saturday Sizzle Set!! With my favourite skillmill finisher… 😎😎😎 1 minute landmine press, 1 minute kettlebell swings, 1 minute skillmill run!! How many sets can you do???” అంటూ మహేష్ ఇన్స్టాలో పోస్ట్ చేసాడు. ఈ వీడియోస్ చూసిన మహేష్ ఫాన్స్, సోషల్ మీడియాలో #MaheshBabu టాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా బాడీ పెంచే పనిలో ఉన్న మహేశ్ బాబు, పర్ఫెక్ట్ టోన్డ్ బాడీ షేప్ లోకి వస్తున్నట్లు ఉన్నాడు. ఎప్పుడూ ఫిట్ గానే ఉండే మహేశ్ బాబు…  SSMB 28 ప్రాజెక్ట్ అయిపోగానే SSMB 29 సినిమా స్టార్ట్ చేయనున్నాడు. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా కోసం కూడా మహేశ్ బాబు ఫిజిక్ పెంచాల్సిన అవసరం ఉంది. డిసెంబర్ నుంచి రాజమౌళి, మహేశ్ బాబు సినిమా ప్రీప్రొడక్షన్స్ వర్క్స్ ఫుల్ స్వింగ్ లో స్టార్ట్ అవనున్నాయి. మరి కొత్త లుక్ లో మహేష్ ఏ రేంజులో కనిపిస్తాడో చూడాలి.

 

Show comments