కింగ్ ఆఫ్ రీజనల్ సినిమా బాక్సాఫీస్ రికార్డ్స్ గా పేరున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి చేస్తున్న మూడో సినిమా ‘గుంటూరు కారం’. అతడు, ఖలేజా సినిమాలతో మిస్ అయిన హిట్ ని ఈసారి సాలిడ్ గా కొట్టడానికి వస్తున్న ఈ ఇద్దరూ ఇండస్ట్రీ హిట్ పై కన్నేశారు. జనవరి 12న మహేష్ బాబు చేయబోతున్న బాక్సాఫీస్ ర్యాంపేజ్ నెవర్ బిఫోర్ మాస్ హిస్టీరియాని చూపించనుందని మేకర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సినిమా గురించి ఎన్ని రూమర్స్ వచ్చినా అవేమి గుంటూరు కారం రిజల్ట్ ని దెబ్బ తీయలేవని ప్రొడ్యూసర్ నాగ వంశీ నమ్మకంగా చెప్తున్నాడు. మాస్ స్ట్రైక్ అనే గ్లిమ్ప్స్ తో గుంటూరు కారం సినిమాపై అంచనాలని పెంచిన త్రివిక్రమ్, మహేష్ బాబు… ఈ సినిమా ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు.
థమన్ మ్యూజిక్ అందిస్తున్న గుంటూరు కారం ఆల్బమ్ నుంచి మొదటి సాంగ్ ఇప్పటికే బయటకి రావాల్సి ఉండగా, అది డిలే అయ్యింది. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం గుంటూరు కారం సినిమా ప్రమోషన్స్ కి కర్టైన్ రైజర్ గా ఫస్ట్ సాంగ్ బయటకి రానుందట. దసరా పండగ రోజున గుంటూరు కారం ఫస్ట్ లిరికల్ సాంగ్ బయటకి రానుంది. ఈ సాంగ్ తో ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసి… దసరా నుంచి సంక్రాంతి వరకూ ప్రమోషన్స్ తో మోత మోగిలించాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. సాంగ్స్, టీజర్, ట్రైలర్… ఇలా గుంటూరు కారం సినిమా నుంచి అప్డేట్స్ బయటకి వస్తూనే ఉంటే సాలిడ్ బజ్ జనరేట్ అవుతూనే ఉంటుంది. ప్రమోషనల్ కంటెంట్ బాగుంటే మహేష్ బాబు సినిమాకి సంక్రాంతి సీజన్ లోనే కాదు ఏ సీజన్ లో కూడా అడ్డు నిలిచే ధైర్యం మిగిలిన సినిమాలు చేయలేవు. మరి 2024 సంక్రాంతి ఎన్ని సినిమాలు రేస్ లో నిలుస్తాయి, ఎన్ని సైడ్ అయిపోతాయి అనేది చూడాలి.
