అతడు, ఖలేజా లాంటి కల్ట్ స్టేటస్ ఉన్న సినిమాలని ఇచ్చిన మహేష్ బాబు-త్రివిక్రమ్ మూడోసారి కలిసి చేస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. ఈసారి మాస్ తప్ప మెసేజులు లేవమ్మా అనే స్టేట్మెంట్ ఇస్తూ గుంటూరు కారం మాస్ స్ట్రైక్ వీడియోని రిలీజ్ చేసారు. ఈ వీడియోలో మహేష్ బాబు పోకిరి రోజులని గుర్తు చేసే రేంజులో ఉండడంతో, గుంటూరు కారం ఘాటుకి యూట్యూబ్ మొత్తం షేక్ అయ్యింది. 24 గంటల్లో ఒక మట్టి తుఫానులా యూట్యూబ్ కి కబ్జా చేసిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్ వీడియో ఓవరాల్ గా 25 మిలియన్ వ్యూస్ రాబట్టి, మోస్ట్ వ్యూడ్ గ్లిమ్ప్స్ లోనే కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. గుంటూరు కారం కన్నా ముందు పుష్ప ది రూల్ గ్లిమ్ప్స్ టాప్ ప్లేస్ లో ఉండేది. మహేష్ బాబు ఆ రికార్డ్ ని హ్యూజ్ మార్జిన్ తో బ్రేక్ చేసాడు. టాలీవుడ్ లో గుంటూరు కారం రికార్డు ఇప్పట్లో బ్రేక్ అవ్వడం కష్టమేనని మహేష్ ఫాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
అంతలా అభిమానులని మెప్పించిన ఈ మాస్ స్ట్రైక్ వీడియోలో ఉన్న సాంగ్ కి తమన్ సూపర్బ్ మ్యూజిక్ ఇవ్వగా… సాంగ్ లిరిక్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ లిరిక్స్ రాసింది మరెవరో కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఏ… ఆయన రాసాడు కాబట్టే మ్యాజిక్ ఆ రేంజులో ఉందంటూ తమన్ ట్వీట్ చేసాడు. గతంలో మహేష్ తో త్రివిక్రమ్ చేసిన రెండు సినిమాలకి మంచి పేరొచ్చింది, రెండు టీవీలో సూపర్ హిట్ అయ్యాయి కానీ థియేటర్స్ లో మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేడు. ఈసారి మాత్రం ఆ లోటు కనిపించకుండా చేయడానికి మహేష్ అండ్ త్రివిక్రమ్ రెడీ అయ్యారు. గుంటూరు కారం సినిమాతో సాలిడ్ హిట్ కొట్టి, ఆ తర్వాత రాజమౌళి సినిమాకి వెళ్లిపోవడానికి మహేష్ ప్లాన్ చేసుకున్నాడు. రాజమౌళి సినిమా స్టార్ట్ అయితే మహేష్ దాదాపు మూడేళ్ల పాటు కనపడడు కాబట్టి ఈ మూడేళ్ల పాటు మహేష్ పేరు వినిపిస్తూనే ఉండాలి అంటే గుంటూరు కారం సినిమాతో మహేష్ కొట్టే హిట్ ఆ రేంజులోనే ఉండాలి. మరి త్రివిక్రమ్ అండ్ మహేష్ ఏం చేస్తారో చూడాలి.
Yay 🔥#GunturKaaram ALL TIME RECORD 🫶🔊 those asking about lyrics 🔥🔥🔥🔥🔥 yes it’s written by #Trivikram sir So the Magic !! 🥁🔊🫶 #SSMB28MassStrike #MassStrike https://t.co/Z7J6OG0PYl
— thaman S (@MusicThaman) June 1, 2023