NTV Telugu Site icon

Mahesh Babu: ఏవయ్యా చారీ ఈయనకి అసలు వయసవ్వదా?

Mahesh Babu

Mahesh Babu

కొంతమంది 20ల్లోనే నలబైల్లా కనపడుతూ ఉంటారు… అతి తక్కువ మంది మాత్రం నలభైల్లో కూడా ఇరవైల్లా ఉంటారు. ఈ కేటగిరిలో అందరికన్నా ముందు మెన్షన్ చేయాల్సిన వ్యక్తి సూపర్ స్టార్ మహేష్ బాబు. బై బర్త్ డీ ఏజింగ్ టెక్నాలజీతో పుట్టిన మహేష్ బాబు ఎప్పటికప్పుడు అమ్మాయిలకి ప్రేమ పుట్టేలా… అబ్బాయిలకి కూడా ఈర్ష పుట్టేలా అందంగా కనిపించడం సూపర్ స్టార్ కే చెల్లింది. ఈ విషయాన్నే మరోసారి ప్రూవ్ చేస్తూ సోషల్ మీడియాలో మహేష్ బాబు కొత్త ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫ్యాషన్‌ డిజైనర్‌ శ్రేయా భూపాల్‌ బేబీషవర్‌ పార్టీలో మహేశ్‌బాబు, నమ్రతా, సితార కనిపించి సందడి చేశారు. ఈ పార్టీలో మహేశ్‌ స్వయంగా సెల్ఫీలు తీసి, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. దీంతో ఫోటోల్లో చాలా ఎనర్జిటిక్ గా ఉన్న మహేష్ బాబుని చూసి ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

ఈ ఫోటోలని నమ్రత తన ఇన్స్టాలో షేర్ చేస్తూ… “About last night! My first official party with our 11-year-old, and she had an absolute blast, much like her father. Just like the old times… Met all our friends who came out of the woodwork . Just like we did! But whatta party! Thank you our little blessed couple, @shriyabhupal and @anindith, for hosting the best party in town. Thank you @diabhupal, @krishnarbhupal and @shalini_bhupal for being the best hosts” అని ట్వీట్ చేసింది.

Show comments