NTV Telugu Site icon

Superstar Krishna: ప్రతి ఏడాది కృష్ణ స్మారక అవార్డు ప్రదానం

Superstar Krishna

Superstar Krishna

Superstar Krishna: ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ మనకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే సినీరంగంలో విశిష్ట సేవలందించిన వ్యక్తికి ప్రతి ఏడాది సూపర్ స్టార్ కృష్ణ స్మారక అవార్డ్ ప్రదానం చేస్తామని ఏపీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు, దర్శకుడు దిలీప్ రాజా ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మ అవార్డును ఎవరికి ఇవ్వాలన్న విషయాన్ని ప్రజా బ్యాలెట్ ద్వారా నిర్ణయిస్తామంటున్నారు. ప్రజా బ్యాలెట్‌లో అత్యధిక ఓట్లు వచ్చిన ఒకరిని సూపర్ స్టార్ కృష్ణ స్మారక అవార్డుకు జ్యూరీ ఎంపిక చేస్తుందన్నారు. తెనాలికి చెందిన కృష్ణ జ్ఞాపకాలను మర్చిపోలేక ఈ మహోన్నత పురస్కారానికి శ్రీకారం చుట్టామని ఆయన వివరించారు. త్వరలో మహేష్ బాబుతో కూడా ఈ విషయమై చర్చిస్తామని, అలాగే పురస్కార వేడుక జరిగే తేదీని త్వరలో తెలియజేస్తామన్నారు. పారదర్శకత కోసం దీనికి సంబంధించిన విధి విధానాలపై జ్యూరీ ప్రాథమిక చర్చలు పూర్తి చేసిందని, ప్రతి ఏటా తెనాలిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనే నిర్ణయం ఏపీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తీసుకుందని దిలీప్ రాజా చెప్పారు. మరి సూపర్ స్టార్ కృష్ణ స్మాకర తొలి అవార్డును అందుకోనున్న తొలి తార ఎవరో చూడాలి.

Read Also: Rishab Shetty: మాజీ మరదలు రష్మికతో కాంతార హీరో గొడవ..?