Site icon NTV Telugu

Super Singer Auditions: హైదరాబాద్‌లో స్టార్ మా సూపర్ సింగర్ ఆడిషన్స్.. అవకాశాన్ని వదులుకోవద్దు

Supersinger

Supersinger

Super Singer Auditions in hyderabad: తెలుగు రాష్ట్రాల్లో అత్యుత్తమ సింగింగ్ టాలెంట్ హంట్‌లలో ఒకటయిన స్టార్ మా సూపర్ సింగర్ ఔత్సాహిక గాయకులు – సంగీత ప్రేమికులందరినీ పిలుస్తోంది! ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సూపర్ సింగర్ కొత్త సీజన్‌ను స్టార్ మా ప్రారంభిస్తున్నందున మరెక్కడా లేని విధంగా సంగీత ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉండండని అంటూ అధికారికంగా ప్రకటించింది. అందుకు వేదిక సిద్ధమైంది, స్పాట్ లైట్ నిరీక్షిస్తుంది. ఆంధ్రప్రదేశ్ – తెలంగాణా నుండి వచ్చిన సింగర్స్, తమ అసాధారణ గాన ప్రతిభను ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది!

Renu Desai: నేను ఏది ప్లాన్ చేయలేదు.. పవన్ కళ్యాణ్ కు నచ్చి.. నన్ను..

స్టార్ మా సూపర్ సింగర్, ఈ ప్రాంతంలోని సంగీత ప్రియుల హృదయాలను కొల్లగొట్టిన వేదిక, తమ తదుపరి గాన సంచలనాన్ని ఆవిష్కరించడానికి తిరిగి వచ్చింది. అక్టోబర్ 15, 2023న హైదరాబాద్‌లో అమీర్‌పేటలో ఉన్న సారథి స్టూడియోస్‌లో ఉదయం 9:00 గంటలకు ఆడిషన్స్ ప్రారంభమవుతాయి. మీరు 18-30 సంవత్సరాల వయస్సు గలవారైతే, మీ స్వర ప్రతిభతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకోవాలని కలలుకంటున్నట్లయితే; ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. మరిన్ని వివరాల కోసం, దయచేసి సంప్రదించండి : కళ్యాణ్ చక్రవర్తి @ 9381340098

Exit mobile version