Site icon NTV Telugu

ఆదిపురుష్ : లక్ష్మణుడి బర్త్ డే వేడుకల్లో టీం

Sunny Singh birthday celebrations from the sets of Adipurush

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ పౌరాణిక చిత్రం “ఆదిపురుష్”. ఈ సినిమాలో లక్ష్మణుడి పాత్రలో కనిపించనున్న సన్నీ సింగ్ నిన్న పుట్టినరోజును జరుపుకున్నారు. సన్నీ సింగ్ తన పుట్టిన రోజును ‘ఆదిపురుష్’ టీం సెట్స్ లో ఘనంగా సెలెబ్రేట్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక ఫోటోలో ప్రభాస్ సన్నీ సింగ్‌కు కేక్ తినిపించడం కనిపిస్తుంది.

Read Also : ఆ స్టార్ కోసం “పుష్ప”రాజ్ వెనకడుగు

‘తన్హాజీ’ ఫేమ్ ఓం రౌత్ ‘ఆదిపురుష్’కు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో, సన్నీ ఆయన సోదరుడు లక్ష్మణుడి పాత్రలో కనిపిస్తారు. సైఫ్ అలీ ఖాన్ లంకేశుడిగా, కృతి సనన్ సీతాదేవి పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘ఆదిపురుష్’ వచ్చే ఏడాది విడుదల కానుంది. ప్రస్తుతానికి వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ ను పూర్తి చేసి సినిమాలో ఎక్కువ భాగం గ్రాఫిక్స్ కే ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి దానిపై దృష్టి పెట్టనున్నారు మేకర్స్.

Exit mobile version