ఆ స్టార్ కోసం “పుష్ప”రాజ్ వెనకడుగు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ఇంటరెస్టింగ్ భారీ యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప”. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ‘పుష్ప’రాజ్ అనే పాత్రలో కనిపించబోతున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఈ డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అప్పటి నుంచి పుష్పరాజ్ అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఓ స్టార్ హీరో కోసం పుష్పరాజ్ వెనక్కి తగ్గబోతున్నాడట. ఆయన సినిమా కోసం ‘పుష్ప’ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఎవరా హీరో అంటే ?

Read Also : మంచు విష్ణుకు అంత ఆత్రం ఎందుకు..? ప్రకాష్ రాజే గెలుస్తాడు: నాగబాబు

టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సీనియర్ హీరోల సినిమాల్లో ‘అఖండ’, ‘ఆచార్య’ కూడా ఉన్నాయి. అయితే ఈ సినిమా విడుదలపై ఇప్పటికీ మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. బాలకృష్ణ ‘అఖండ’ను దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. మిగిలింది ‘ఆచార్య’. తాజా సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ ఈ ఏడాది డిసెంబర్ 17న విడుదలకు సిద్ధమవుతున్నట్టు టాక్. అయితే ఇప్పటికే క్రిస్మస్ కానుకగా సినిమాను విడుదల చేస్తామని చెప్పిన “పుష్ప” కూడా సినిమా విడుదలపై సరైన క్లారిటీ ఇవ్వలేదు. మెగాస్టార్ ‘ఆచార్య’గా డిసెంబర్ 17న వస్తున్నాడు కాబట్టి ‘పుష్ప’రాజ్ వెనక్కి తగ్గే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ‘పుష్ప’ డిసెంబర్ 24న విడుదలైతే ఆ సినిమాకూ, దినికి మధ్య వారం గ్యాప్ ఉంటుంది. మరి “పుష్ప” పోస్ట్ పోన్ అవుతుందా ? ‘ఆచార్య’ కోసం ‘పుష్ప’రాజ్ వెనకడుగు వేసి మెగాస్టార్ కు దారి ఇస్తాడా ? చూడాలి.

-Advertisement-ఆ స్టార్ కోసం "పుష్ప"రాజ్ వెనకడుగు

Related Articles

Latest Articles