Site icon NTV Telugu

Ginna: శృంగారతార స‌న్నీలియోన్‌తో మంచు విష్ణు రొమాంటిక్ సాంగ్

Ginna Romantic Song

Ginna Romantic Song

Sunny Leone Manchu Vishnu Romantic Song Released From Ginna: మంచు విష్ణు న‌టించిన తాజా చిత్రం ‘జిన్నా’. ఈ నెల 21న ఈ సినిమా జ‌నం ముందుకు రాబోతోంది. మోహ‌న్ బాబు ఆశీస్సుల‌తో ఏవీఎ ఎంట‌ర్ టైన్ మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ దీనిని సంయుక్తంగా నిర్మించాయి. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు జి. నాగేశ్వ‌ర‌రెడ్డి మూల క‌థ‌ను అందించ‌గా, కోన వెంక‌ట్ స్క్రీన్ ప్లే స‌మ‌కూర్చ‌డంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్ గా వ్య‌వ‌హ‌రించారు. సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీలో పాయ‌ల్ రాజ్ పుత్ హీరోయిన్ కాగా మ‌రో కీల‌క పాత్ర‌ను శృంగార తార స‌న్నీ లియోన్ పోషించింది.

తాజాగా మంచు విష్ణు, స‌న్నీలియోన్ పై చిత్రీక‌రించినా ‘జారు మిఠాయి’ సాంగ్ లిరిక‌ల్ వీడియోను చిత్ర బృందం విడుద‌ల చేసింది. దాబా సాంగ్ గా రూపుదిద్దుకున్న దీనికి ఎ. గ‌ణేశ్ సాహిత్యం అందించ‌గా, అనూప్ రూబెన్స్ స్వ‌ర‌ర‌చ‌న చేశారు. ఐట‌మ్ సాంగ్ ను త‌ల‌పిస్తున్న దీనిని సింహా, నిర్మ‌ల రాథోడ్ గానం చేశారు. ఈ రొమాంటిక్ డాన్స్ నంబ‌ర్ కు ప్రేమ్ ర‌క్షిత్ కొరియోగ్ర‌ఫీ అందించారు. యువ‌త‌ను టార్గెట్ చేస్తూ ఈ పాట చిత్రీక‌రించిన‌ట్టు అర్థ‌మౌతోంది. తెలుగు, మ‌ల‌యాళ, హిందీ భాష‌ల్లో విడుద‌ల కాబోతున్న ‘జిన్నా’ చిత్రానికి ఎలాంటి ఆద‌ర‌ణ ల‌భిస్తుందో చూడాలి.

Exit mobile version