Site icon NTV Telugu

‘షేరో’ పూర్తి చేసిన సన్నీ.. ఫస్ట్ లుక్ కూడా వచ్చేసింది

సన్నీ లియోన్ థ్రిల్లింగ్ కెరీర్ కి మరో థ్రిల్లర్ మూవీ జతైంది. ఆమె తమిళ చిత్రం ‘షేరో’ షూటింగ్ పూర్తి చేసింది. చివరి రోజు ప్యాకప్ సందర్భంగా క్లాప్ బోర్డ్ తో సహా డైరెక్టర్ శ్రీజిత్ విజయన్ తో కెమెరాకు ఫోజిచ్చింది. అయితే, సైకాలజికల్ థ్రిల్లర్ మూవీ ‘షేరో’లో ఆమె క్యారెక్టర్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుందట. ఈమేరకు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. భారతీయ మూలాలున్న అమెరికన్ లేడీగా సన్నీ కనిపించబోతోంది. ఇండియాకి వచ్చిన ఆమెకు ఎందుకు, ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురయ్యాయో సినిమాలో చూడాల్సిందే!

తన తాజా చిత్రం కోసం సన్నీ లియోన్ బాగానే కష్టపడింది. ఓన్ గా స్టంట్స్ చేయటంతో పాటూ తమిళం కూడా నేర్చుకుని డైలాగ్స్ చెప్పిందట! తనకిచ్చిన ‘సారా’ పాత్రలో పూర్తిగా మునిగిపోయి నటించేందుకు ఆమె ఎంతో హోమ్ వర్క్ చేసిందని దర్శకుడు అంటున్నాడు. చూడాలి మరి, మల్టీ లింగ్యువల్ మూవీగా విడుదలకు సిద్ధం అవుతోన్న ‘షేరో’ బాక్సాఫీస్ వద్ద ఎంత రెవన్యూ షేర్ రాబడుతుందో!

Exit mobile version